
జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'డ్రాగన్'. ప్రశాంత్ నీల్ సినిమా అనగానే డార్క్ థీమ్, భారీ ఎలివేషన్లు గుర్తుకొస్తున్నాయి. 'డ్రాగన్' కూడా అలాగే ఉండబోతుందని గ్లింప్స్ తో అర్థమైంది. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉందట. ప్రశాంత్ నీల్ తన రెగ్యులర్ శైలికి భిన్నంగా.. ఎన్టీఆర్ కోసం ఒక లవ్ ట్రాక్ ని, ముఖ్యంగా ఒక బ్యూటిఫుల్ లవ్ సాంగ్ ని డిజైన్ చేశారట.
'డ్రాగన్' సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ప్రెజెంట్ టైమ్‌లైన్‌లో ఒక క్రూరమైన అస్సాసిన్‌గా సాగుతుంది. అంతర్జాతీయ ఓపియం మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ పాత్ర పేరు 'లూగర్'. ఈ లూగర్ పాత్ర మొత్తం ప్రశాంత్ నీల్ మార్క్ డార్క్ అండ్ గ్రే షేడ్స్‌లోనే, రక్తం ఉడికిపోయే సీన్స్, వైలెంట్ ఎలివేషన్లతో నెవర్ బిఫోర్ రేంజ్‌లో ఉండబోతోంది.
ఒక మామూలు మనిషి, ఇంత క్రూరమైన 'లూగర్' అనే అస్సాసిన్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? అసలు అతనికి ఎదురైన ఆ ఘోరమైన ట్రాజెడీ ఏంటి? అనేదే ఈ సినిమాలో మేజర్ హైలైట్ కాబోతోంది. ఈ గతాన్ని చూపించే ఫ్లాష్‌బ్యాక్ పోర్షన్స్ కోసం నీల్ ఒక సరికొత్త కలర్‌ఫుల్ వరల్డ్‌ని క్రియేట్ చేశారట.

ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ చాలా కూల్‌గా, క్లాస్‌గా, లవ్లీగా ఉండబోతోంది. హీరోయిన్ రుక్మిణి వసంతతో కలిసి ఒక వింటేజ్ అండ్ క్లాసిక్ లవ్ ట్రాక్ నడుస్తుందని టాక్. అంతేకాదు, ప్రశాంత్ నీల్ సినిమాల్లో మనం ఇప్పటివరకు చూడని విధంగా.. రిచ్ లొకేషన్స్, కలర్‌ఫుల్ కాస్ట్యూమ్స్‌తో ఒక మైండ్ బ్లోయింగ్ మెలోడీ లవ్ సాంగ్‌ని కూడా డిజైన్ చేశారట. కన్నులవిందు చేసే విజువల్స్‌తో ఈ సాంగ్ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకోవడం ఖాయం అంటున్నారు.
ఆ ప్రశాంతమైన, అందమైన రంగుల ప్రపంచం.. ఒక ఊహించని ఘోరమైన సంఘటన వల్ల ఒక్కసారిగా చీకటి మయంగా మారిపోతుంది. ఆ పగ, ప్రతీకారం వల్ల రూపుదిద్దుకున్న భయంకరమైన రూపమే ఈ 'లూగర్'... అదే మన 'డ్రాగన్'. ప్రశాంత్ నీల్ మార్క్ పీక్ ఎమోషన్స్, మాస్ గూస్‌బమ్స్ మూమెంట్స్, దానికి తోడు ఎన్టీఆర్ నటన... ఇవన్నీ థియేటర్లలో విజువల్ ఫీస్ట్‌ని అందించబోతున్నాయి.
[Dragon Movie Love Song, Dragon Movie Flashback, NTR Luger Character, NTR Dragon Movie, Jr NTR, Prashanth Neel, Rukmini Vasanth, Telugu Film News, Telugu News]





