Home

»

Latest News

Prabhas: కోకాపేటలో ప్రభాస్ డ్రీమ్ హౌస్..  ఆ ఒక్క ఎకరం ధర వింటే షాక్ అవ్వాల్సిందే

May 25, 2026 1:05PM

 

 

- కోకాపేటలో  రెండు ఎకరాల స్థలం తీసుకున్న ప్రభాస్ 
-ప్రభాస్ డ్రీమ్ మ్యాన్షన్ నిర్మాణం
-గ్లోబల్ ఆర్కిటెక్ట్స్‌తో డిజైన్.
-లోపల ఉండబోయే అల్ట్రా లగ్జరీ ఫీచర్స్ ఇవే

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)హైదరాబాద్‌లోనే అత్యంత ఖరీదైన, లగ్జరీ లొకేషన్‌గా పేరుగాంచిన కోకాపేట(Kokapeta)ఏరియాలో తన సరికొత్త డ్రీమ్ హౌస్ నిర్మాణ పనులని  అధికారికంగా ప్రారంభించారు. రియల్ ఎస్టేట్ పరంగా దూసుకుపోతున్న కోకాపేట ఔటర్ రింగ్ రోడ్  ఎగ్జిట్ సమీపంలో ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ప్రభాస్‌కు చెందిన రెండు ఎకరాల భారీ స్థలంలో ఈ నూతన గృహ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.

ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరం భూమి విలువ దాదాపు 150 కోట్లకి  పైగా ఉంది.  అంటే కేవలం ఆయన కొనుగోలు చేసిన ఈ రెండు ఎకరాల ఖాళీ స్థలం విలువే 300  కోట్లకి  పైమాటే. ఇండస్ట్రీ సమాచారం ప్రకారం, ఈ భారీ స్థలంలో అన్ని రకాల అత్యాధునిక హంగులు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒక 'అల్ట్రా లగ్జరీ మ్యాన్షన్' రూపుదిద్దుకోబోతోంది. అంతర్జాతీయ ఆర్కిటెక్ట్స్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ లగ్జరీ ప్యాలెస్‌లో భారీ హోమ్ థియేటర్, అత్యాధునిక జిమ్నేషియం, అద్భుతమైన స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్పోర్ట్స్ ఏరియాని  ప్లాన్ చేశారు. వీటితో పాటు ప్రభాస్ తన సినిమాల సిట్టింగ్స్, కథల చర్చల కోసం ప్రత్యేకంగా ఒక ల్యావిష్ లాంజ్‌ ని  కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.


Also read: 150 ఎన్‌కౌంటర్ల రియల్ పోలీస్ స్టోరీ.. ఓటీటీలో ఇదే నంబర్ వన్ ట్రెండింగ్ మూవీ 

గతంలో ప్రభాస్ రాయదుర్గంలోని తన గెస్ట్ హౌస్‌ని వేడుకలకి  వేదికగా ఉపయోగించేవారు. అయితే ఆ ప్రాంతం క్రమంగా రద్దీగా మారడంతో, పూర్తి ప్రైవసీని ఇచ్చే పెద్ద స్థలం కోసం ఆయన వెతికారు. ఆ విధంగా  కోకాపేట స్థలాన్ని ఎంచుకున్నారు. ఈ అల్ట్రా ప్రైవేట్ ప్రాపర్టీ నిర్మాణం పూర్తిగా పూర్తి కావడానికి దాదాపు 2 సంవత్సరాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. షూటింగ్స్ లేని సమయంలో ప్రశాంతంగా గడపడానికి, సినీ ఇండస్ట్రీ ప్రముఖులకు గ్రాండ్ గా ఆతిథ్యం ఇవ్వడానికి ఈ లగ్జరీ ప్యాలెస్ కేరాఫ్ అడ్రస్‌గా నిలవనుంది. ప్రభాస్ ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీ, కల్కి పార్ట్ 2 చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.  

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com