Home

»

Latest News

150 ఎన్‌కౌంటర్ల రియల్ పోలీస్ స్టోరీ.. ఓటీటీలో ఇదే నంబర్ వన్ ట్రెండింగ్ మూవీ 

May 25, 2026 12:43PM

 


నిజ జీవిత సంఘటనలు, యథార్థ నేరాల ఆధారంగా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్‌లకి  ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలోనే సరికొత్త క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. సినిమా ప్రియులు అస్సలు మిస్ అవ్వకూడని టాప్ రేటెడ్ కంటెంట్‌గా డిజిటల్ ఆడియన్స్ నుండి దీనికి భారీ ప్రశంసలు దక్కుతున్నాయి. అదే బాలీవుడ్ వెరైటీ యాక్టర్ రణ్‌దీప్ హుడా కీ రోల్ పోషించిన  పవర్‌ఫుల్ వెబ్ సిరీస్ ‘ఇన్‌స్పెక్టర్ అవినాష్.  ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో విడుదలైన ఈ సిరీస్ సీక్వెల్, అంటే 'ఇన్‌స్పెక్టర్ అవినాష్ సీజన్ 2' ప్రస్తుతం నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతోంది.

ఉత్తరప్రదేశ్‌ పోలీస్ శాఖలో కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్లకి ,మాఫియా డాన్లకి  నిద్రలేకుండా చేసిన ఒక రియల్ సూపర్ కాప్ నిజ జీవిత కథ ఆధారంగా దర్శకుడు నీరజ్ పాఠక్ ఈ సిరీస్‌ని  అద్భుతంగా తెరకెక్కించారు. యూపీలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన పోలీస్ ఆఫీసర్ అవినాష్ మిశ్రా సుదీర్ఘ కెరీర్‌లో దాదాపు 150 మంది మాఫియా డాన్లు, రౌడీ మూకలని ఎన్‌కౌంటర్ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆ భీకరమైన 150 ఎన్‌కౌంటర్ల రియల్ పోలీస్ స్టోరీనే ఇప్పుడు మనకు కళ్ళకు కట్టినట్లు వెబ్ సిరీస్ రూపంలో చూపిస్తున్నారు. గత వారమే ఓటీటీలోకి అడుగుపెట్టిన ఈ సీజన్ 2, కేవలం కొద్ది రోజుల్లోనే అత్యధిక వీక్షణలతో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఒరిజినల్ హిందీ కంటెంట్ అయినప్పటికీ, దక్షిణాది ఆడియెన్స్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి ఏడు ప్రముఖ భాషల్లో దీనిని అందుబాటులోకి తెచ్చారు. మాస్ మసాలా ఎలిమెంట్స్, అబ్బురపరిచే హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.


Also read: udhayanidhi stalin: ఉదయనిధి స్టాలిన్ హీరో.. మరి విజయ్ పరిస్థితి ఏంటి 

ఈ సిరీస్‌లో రణ్‌దీప్ హుడా తన పవర్‌ఫుల్ యాక్టింగ్‌తో ఇన్‌స్పెక్టర్ అవినాష్ క్యారక్టర్ కి ప్రాణం పోశాడు. ఆయనతో పాటు గ్లామరస్ బ్యూటీ ఊర్వశి రౌతేలా, షాలిన్ భానోత్ ముఖ్యమైన క్యారెక్టర్స్ లో మెప్పించారు. ఈ రెండో సీజన్‌లో మొత్తం 10 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ దాదాపు 40 నిమిషాల నిడివితో ఉత్కంఠభరితంగా సాగుతుంది. మొదటి సీజన్ భారీ విజయం సాధించగా, ఇప్పుడు సీజన్ 2 అంతకు మించిన మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు, పొలిటికల్ డ్రామా,క్రైమ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులని  కట్టిపడేస్తోంది. ఐఎమ్‌డిబి (IMDb)లో 7.6 రేటింగ్‌తో దూసుకుపోతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్, వీకెండ్‌లో ఒక మంచి యాక్షన్ సిరీస్ చూడాలనుకునే ఓటీటీ ప్రియులకి  బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. జియో హాట్‌స్టార్‌లో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రియల్ ఎన్‌కౌంటర్ థ్రిల్లర్‌ని అసలు మిస్ అవ్వకండి

 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com