ఇది కదా ‘స్పిరిట్’ రేంజ్.. ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిస్తున్న లేటెస్ట్ అప్‌డేట్!
on Dec 9, 2025
- ప్రభాస్ ఎంట్రీ ఎలా ఉంటుందంటే..?
- ఆ సెట్ సినిమాలో కీలకం
- ప్రభాస్ క్యారెక్టరైజేషన్ అదుర్స్
బాహుబలి సిరీస్, సలార్, కల్కి వంటి భారీ బ్లాక్‌బస్టర్స్‌తో ప్రపంచవ్యాప్తంగా హీరోగా తన రేంజ్ ఏమిటో చూపించిన ప్రభాస్(Prabhas).. అర్జున్‌రెడ్డి, కబీర్‌సింగ్, యానిమల్ వంటి వైల్డ్ రేంజ్ హిట్స్‌తో దేశాన్ని ఉర్రూతలూగించిన డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా(Sandeep Reddy Vanga). వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తోందీ అంటే అది ఎలా ఉంటుంది అనేది ఊహించడం చాలా కష్టం. ఈ సినిమా టైటిల్‌ని కూడా ఎవరికీ ఊహకందని విధంగా ‘స్పిరిట్’(Spirit) అని ఫిక్స్ చేశారు. ఈ రేర్ కాంబినేషన్‌లో రూపొందే సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేశారు. మొత్తానికి ‘స్పిరిట్’ చిత్రాన్ని గత నెల పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. నవంబర్ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను కూడా ప్రారంభించారు.
Also Read: అఖండ 2 కి చెన్నై హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ప్రభాస్ కెరీర్‌లోనే ఫస్ట్‌టైమ్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ‘స్పిరిట్’ చిత్రంలో కనిపించబోతున్నారు. రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. కానీ, సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ రావడం లేదని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ‘స్పిరిట్’ నుంచి వచ్చిన అప్‌డేట్ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించేలా ఉంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక భారీ పోలీస్ స్టేషన్ సెట్‌ను నిర్మిస్తోంది చిత్ర యూనిట్. సినిమాలో సెట్ బ్యాక్‌డ్రాప్‌గా ఉండడమే కాకుండా కథలో కీలకంగా నిలబోతోందని తెలుస్తోంది.
Also Read: ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్!
సాధారణంగా టాప్ హీరోల సినిమాల్లో వారి ఎంట్రీ స్పెషల్‌గా ఉండేలా ప్లాన్ చేస్తారు డైరెక్టర్లు. ఇక సందీప్‌రెడ్డి విషయానికి వస్తే.. అతనొక విభిన్నమైన డైరెక్టర్. అతని సినిమాల్లో హీరోలు ఎంత వైల్డ్‌గా బిహేవ్ చేస్తారో తెలిసిందే. అందుకే హీరోల ఎంట్రీ కూడా అంతే వైల్డ్‌గా ఉంటుంది. ‘స్పిరిట్’లో ప్రభాస్‌ది పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. దానికి తగ్గట్టుగానే ఎంట్రీని ప్లాన్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పోలీస్ స్టేషన్ సెట్‌లోనే ప్రభాస్‌పై ఒక అమేజింగ్ సాంగ్‌ని చిత్రీకరించబోతున్నారు. ఈ పాటతోనే ప్రభాస్ ఎంట్రీ ఉంటుందట.
Also Read: ‘టాక్సిక్’ రిలీజ్ డేట్ మరోసారి ఫిక్స్.. మొదలైన కౌంట్‌డౌన్!
ప్రభాస్‌ని ఫస్ట్‌టైమ్ పోలీస్ ఆఫీసర్‌గా చూపిస్తున్న సందీప్.. అతని క్యారెక్టర్‌ని ఎంతో పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారని తెలుస్తోంది. పోలీస్ స్టేషన్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్లాన్ చేశారట. ఈ సెట్ కూడా ఎంతో నేచురల్‌గా ఉంటుందని తెలుస్తోంది. ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అనే విషయంలో ఫ్యాన్స్‌లో ఒక క్లారిటీ వచ్చింది. అయితే దాన్ని స్క్రీన్ మీద ఎంత పవర్‌ఫుల్‌గా చూపిస్తారు అనే దానిపై ఎంతో క్యూరియాసిటీతో ఉన్నారు. ఇప్పటివరకు ప్రభాస్ చేసిన యాక్షన్ మూవీస్‌లో ‘స్పిరిట్’కి తప్పకుండా ప్రత్యేకత ఉంటుంది అనేది అందరి అభిప్రాయం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



