Home

»

Latest News

సర్దార్ కు లవ్యూ చెప్పిన సమంత,నితిన్..!

Mar 26, 2016 6:49PM

అవును. సమంత పవర్ స్టార్ కు పవన్ కళ్యాణ్ కు లవ్యూ చెప్పింది. పవన్ కు మామూలు జనాలే కాక, సెలబ్రిటీల్లో కూడా పిచ్చిపిచ్చిగా ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ లో ఇద్దరు కలిసి ఇప్పుడు సినిమా కూడా చేస్తున్నారు. వాళ్లే సమంత, నితిన్. వీళ్లిద్దరికీ పవన్ అంటే చాలా ఇష్టం. నితిన్ అయితే పవర్ స్టార్ హార్డ్ కోర్ ఫ్యాన్. అందుకే ఇద్దరూ కలిసి, పవన్ ఫ్రెండ్ అయిన త్రివిక్రమ్ డైరెక్షన్లో చిన్న వీడియో తీశారు.

సర్దార్ గబ్బర్ సింగ్ స్టైల్లో నితిన్ చెక్కగుర్రం మీద కూర్చుని ఊగుతుంటే, సమంత ఆ గుర్రాన్ని ఊపుతోంది. ఇద్దరూ కలిసి పవర్ స్టార్ లవ్యూ అంటూ పవన్ పట్ల తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఈ వీడియోను హీరో నితిన్ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. కొరియోగ్రఫీ బై సమంత, డైరెక్షన్ బై త్రివిక్రమ్ గారు అని వీడియోకు స్టాటస్ పెట్టాడు నితిన్. ప్రస్తుతం వీళ్లిద్దరూ త్రివిక్రమ్ డైరెక్షన్లో అ..ఆ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ షూటింగ్ స్పాట్ లోనే ఈ చిన్న ట్రిబ్యూట్ ను తయారుచేశారీ పవన్ ఫ్యాన్స్.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com