Home

»

Latest News

రజనీ ' కబాలీ ' కొత్త పోస్టర్ అదిరింది

Mar 26, 2016 7:25PM

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా కబాలీ ఇఫ్పటికే ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఆయన ఫ్యాన్స్ ఈ సినిమాను భాషా 2 అంటూ అభివర్ణిస్తున్నారు. లేటెస్ట్ గా కబాలీలో కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. రజనీ లుక్ పై ఇప్పటికే భారీ అంచనాలుండగా, లేటెస్ట్ పోస్టర్ ఆ అంచనాలను మరింత పెంచేదిగా కనిపిస్తోంది. చుట్టూ జనాలు, పెద్ద నగరం. ఆ అడ్డంకులన్నింటినీ దాటుకుని, రజనీ పైకి వస్తున్నట్టుగా పోస్టర్ ను డిజైన్ చేశారు. కబాలీ లో వయసు మళ్లిన డాన్ గా రజనీ కనిపిస్తుండగా, ఆయన భార్యగా రాధికా ఆప్టే నటిస్తోంది. పా రంజిత్ దర్శకత్వంలో, వి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. సమ్మర్ కానుకగా మే లో కబాలీని విడుదల చేసే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నారు. థన్సిక, కిశోర్,జాన్ విజరు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com