Home

»

Latest News

ఊపిరి సినిమాపై మహేష్ బాబు కామెంట్..!

Mar 26, 2016 6:29PM

విడుదలైనప్పటి నుంచీ ఊపిరి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటూ దూసుకుపోతోంది. తెలుగు సెలబ్రిటీలు సినిమాపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే ఊపిరిని మిస్ అవకండి అంటూ రాజమౌళి ట్వీట్ చేస్తే, బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ కూడా ఊపిరి తనకు బాగా నచ్చిందంటూ ట్వీటేశాడు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఊపిరితో ప్రేమలో పడిపోయారు. తన ట్విట్టర్లో ఊపిరి టీం ను అభినందించారు. అద్భుతమైన డైరెక్షన్ తో పాటు, నాగ్ కార్తీల యాక్టింగ్ కూడా సూపర్ అని ప్రశంసించారు. ఊపిరి ఔట్ స్టాండింగ్ ఫిల్మ్ అని, మొత్తం టీం కు కంగ్రాట్స్ చెప్పారు మహేష్ బాబు. తెలుగు వెర్షన్ ఇంతలా దూసుకుపోతుంటే, మరోవైపు ఊపిరి తమిళ వెర్షన్ తోజాకు మాత్రం మిశ్రమ స్పందన రావడం విచిత్రం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com