Home

»

Latest News

ఆధునిక మహాభారతానికి "పవన్" ముందు మాట

Jul 7, 2016 12:03PM

పవన్ కళ్యాణ్..ఈ కాలపు హీరోల్లో సాహిత్యంపైన పట్టున్న వ్యక్తిగా అందరికి సుపరిచితమే. ఖాళీగా ఉన్నా..షూటింగ్‌లో ఉన్నా ఏదో ఒక పుస్తకం చదువుతూనే ఉంటారు. పుస్తకాలు మనుషులను ప్రభావితం చేస్తాయని బలంగా నమ్మే పవన్ కళ్యాణ్.. అలాంటి ఒక మంచి పుస్తకం ప్రచురణ కావడానికి తన వంతు సాయం చేశారు. దివంగత మహాకవి "గుంటూరు శేషేంద్ర శర్మ" గారు రాసిన ఆధునిక మహాభారతం పుస్తకాన్ని మళ్లీ రీప్రింట్ చేయించాలనుకున్నారు. రీప్రింటింగ్ అంటే మామూలు విషయం కాదు. దానికి ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది. శేషేంద్ర గారి అబ్బాయి, కవి అయిన సాత్యకి గారికి అంత స్థోమత లేదు. దీంతో ఈ విషయం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ద్వారా పవన్ కళ్యాణ్‌కు తెలిసింది. అంతే రీప్రింట్‌కు అయ్యే మొత్తం ఖర్చును తానే భరిస్తానని పవన్ ముందుకొచ్చారు. అంతేకాకుండా ఆ పుస్తకానికి ముందుమాటను కూడా రాశారు.

"ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు… కలలు ఖనిజాలులో చేసిన యువత మన దేశ భవిష్యత్తుకు నావికులు” అన్న ‘మహాకవి శేషేంద్ర’ గారి మాటలు ఆయనంటే అమితంగా ఇష్టపడేలా చేసినాయి. ‘నీలో సాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా?’ అని ఆయన వేసిన ప్రశ్న నాకు ‘మహావాక్యం’ అయింది. నాకు అత్యంత ప్రీతిపాత్రమయిన ‘ఆధునిక మహాభారతం’ అనే ఈ మహాగ్రంధాన్ని; దేశ, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపనపడే వారి కోసం అందుబాటులో ఉండాలన్న నా ఆకాంక్ష ఈ మహాగ్రంధాన్ని యింకోసారి మీ ముందుకు తీసుకొచ్చింది. నాకు అవకాశాన్ని కల్పించిన ‘మహాకవి శేషేంద్ర గారి అబ్బాయి, కవి అయిన సాత్యకి గారికి, నాకీ ‘మహాకవి’ని పరిచయం చేసిన నా మిత్రుడు ‘త్రివిక్రమ్ శ్రీనివాస్’ గారికి నా కృతజ్ఞతలు… పవన్ కళ్యాణ్..!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com