Home

»

Latest News

బలహీనుడి పక్కన ఉన్న బలమే "జనతా గ్యారేజ్"

Jul 6, 2016 6:17PM

"బలవంతుడు బలహీనుడ్ని భయపెట్టి బతకడమే ఆనవాయితీ, బట్ ఫర్ ఏ ఛేంజ్.. బలహీనుడి పక్కన ఉన్న బలమే "జనతా గ్యారేజ్"" అంటూ ఎన్టీయార్ డిఫరెంట్ మోడ్యులేషన్ లో చెప్పిన డైలాగ్ తో కూడిన "జనతా గ్యారేజ్" టీజర్ ను రంజాన్ సందర్భంగా నేడు (జూన్ 6) విడుదల చేశారు. ఎన్టీయార్ అల్ట్రా స్టైలిష్ గెటప్ లో.. పవర్ ఫుల్ గా చెప్పిన డైలాగ్ టీజర్ కి హైలైట్ గా నిలిచింది. ఇక దేవిశ్రీప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణ. టీజర్ చివర్లో ముస్లిం దుస్తుల్లో మోహన్ లాల్ తో కలిసి "సలామ్" కొడుతున్న ఎన్టీయార్ గెటప్ కు విశేషమైన స్పందన లభిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్ లు కథానాయికలుగా నటిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ "జనతా గ్యారేజ్"ను నిర్మిస్తోంది. జూలై 22న ఈ చిత్రం ఆడియోను విడుదల చేసి.. ఆగస్ట్ 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com