Home

»

Latest News

కుక్క తోక వంకరే..మికా సింగ్‌పై మరో కేసు

Jul 7, 2016 1:01PM

కుక్క తోక వంకరే..అన్న మాట బాలీవుడ్ సింగర్ మికా సింగ్‌కు సరిగ్గా సరిపోతుంది. ఇప్పటికే దూకుడు స్వభావంతో, పోకిరి వేషాలతో అనేక వివాదాలతో పాటు పోలీసు కేసుల్లో చిక్కుకున్నా..ఆయన ఇంకా తన బుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. తాజాగా మరో వివాదంలో మికా ఇరుక్కున్నాడు. మికా సింగ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఓ మోడల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలీవుడ్‌కు చెందిన ఓ డిజైనర్ తరచుగా మికాసింగ్ ఇంటికి వెళ్లొస్తుండేది. అయితే ఇటీవల ఒకసారి వెళ్లిన ఆమెను లైంగికంగా వేధించాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనిపై సదరు డిజైనర్ పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు మికాసింగ్‌పై ఐపీసీ సెక్షన్ 354, 504 కింద కేసు నమోదు చేశారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com