
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రెండు దశాబ్దాల తన కెరిర్‌లో హీరోయిన్లను రిపీట్ చేయడం చాలా అరుదు. ఒకేఒక్కసారి ఈ ప్రయోగం చేశాడు. తన మాజీ భార్య రేణుదేశాయ్‌తో కలిసి రెండు సినిమాల్లో నటించాడు పవన్. బద్రి సినిమాలో తొలిసారిగా కలిసి నటించిన ఈ జంట ఆ తరువాత జానీ సినిమాలో మరోసారి జంటగా కనిపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సిన్ రిపీట్ కాలేదు కాని మరోసారి ఈ ప్రయోగం చేయాలనుకుంటున్నాడు పవన్.
ఎస్.జె సూర్య దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మాతగా పవన్ నటిస్తున్న ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్నఈ సినిమా జూన్‌లో పట్టాలెక్కనుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరా అనేది ఇంకా కన్ఫామ్ కాలేదు. బెంగళూరు డేస్ హీరోయిన్ పార్వతీ నాయికగా నటించనుందని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే పార్వతి అవుటై, శృతిహసన్ స్క్రీన్ మీదకు వచ్చింది. శృతి గతంలో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్‌బస్టర్‌లో నటించింది. మళ్లీ ఈ కాంభినేషన్‌ను రిపీట్ చేయాలని దర్శకనిర్మాతలు డిసైడ్ అయినట్లు ఫిల్మ్ నగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయాన్ని త్వరలో అఫీషియల్‌గా అనౌన్స్ చేయనుంది ఆ చిత్ర యూనిట్.






