
బాహుబలి, సైజ్ జీరో సినిమాల్లో భారీగా బరువు పెరిగి కనిపించింది కన్నడ ముద్దుగుమ్మ అనుష్క. మొత్తం ఆకారం మారిపోయిన అనుష్క, మళ్లీ పాత అనుష్కలా ఎప్పుడు మారుతుందా అని ఎదురుచూశారు ఆమె అభిమానులు. సోగ్గాడే చిన్నినాయన సినిమాలో కూడా సాలిడ్ గానే కనిపించిందీ పొడుగు భామ. అయితే ఊపిరి సినిమాలో వేసిన గెస్ట్ అప్పియరెన్స్ కు మాత్రం, కాస్త సన్నబడినట్టే అనిపించింది. ఫ్యాన్స్ ను నిరాశపరచడం అనుష్కకు ఇష్టం లేనట్టుంది. ప్రస్తుతం మళ్లీ సన్నబడి, మునుపటి అనుష్కలా తయారైంది. లేటెస్ట్ గా ఫేస్ బుక్ లో తన అన్నయ్యతో కలిసి దిగిన ఫోటోను పెట్టిన అనుష్క, పూర్తిగా ఫిట్ గా మెరుపుతీగలా తయారైంది. సోషల్ మీడియాను చాలా తక్కువగా ఉపయోగించే అనుష్క, ఫేస్ బుక్ లో అప్పుడప్పుడూ మాత్రమే పోస్ట్ లు పెడుతుంటుంది. రీసెంట్ ఫోటోకు, ఫన్ టైం ఫ్యామిలీ టైం, ఈట్.. ప్రే.. లవ్..అంటూ స్టాటస్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న బాహుబలి: ది కన్‌క్లూజన్, సూర్య హీరోగా సింగం 3, ఫిమేల్ ఓరియెంటెడ్ భాగమతి సినిమాలతో అనుష్క బిజీగా ఉంది. చిరంజీవి 150 వ సినిమాలో అనుష్కను తీసుకుంటారని వార్తలు వస్తున్నా, అవి ఎంత వరకూ నిజమో చూడాల్సి ఉంది.






