
బాలీవుడ్, టాలీవుడ్ ఏ వుడ్ అయినా కానీ కొందరు నటీనటులు ఎవరికి తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో బాలీవుడ్ భామ చేరింది. తెలుగులో మహేశ్ సరసన అతిధి సినిమాలో నటించిన అమృతరావ్ ఇవాళ మ్యారేజ్ చేసుకోబోతోంది. ముంబయికి చెందిన రేడియో జాకీ అన్మోల్‌లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ రోజు అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు.






