మహేశ్‌కు విలన్‌గా పవన్ కళ్యాణ్ ఫేవరేట్ డైరెక్టర్..!
on Apr 27, 2016

సూపర్‌స్టార్ మహేశ్ బాబు పక్కన విలన్‌గా నటించేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫేవరేట్ డైరెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆయన ఎవరో కాదు "ఖుషి "సినిమా తో పవన్ కళ్యాణ్‌కి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన "ఎస్.జె.సూర్య ". సూర్య మల్టీ టాలెంటెడ్.. ఖుషి, వాలి చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా అఆ, ఇసై, కళ్వనిన్ కాదలి, తిరుమురుగన్, వ్యాపారి తదితర చిత్రాలలో హీరోగానూ నటించారు. హీరోగా ఛాన్స్ రాని పరిస్థితిలో నన్బన్, వైరాజావై, ఇరవి తదితర చిత్రాల్లో క్యారెక్టర్ పాత్రలలో నటించారు. ఆ తర్వాత దర్శకత్వమా? నటనా? అనే డైలమాలో ఉండగా ..ఏఆర్ మురుగదాస్ తమిళ్, తెలుగులో దర్శకత్వం వహించే చిత్రంలో మహేశ్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో విలన్‌గా నటించేందుకు మురుగదాస్, సూర్యను సంప్రదించారు. దీనికి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కోలీవుడ్ టాక్. ఎస్.జే. సూర్య తెలుగులో మహేశ్‌తో నాని చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



