సిక్స్ కొట్టబోతున్న పూజా హెగ్డే!
on Jan 17, 2022
బుట్టబొమ్మ పూజా హెగ్డే వెండితెరపై మెరిసి ఈ ఏడాది ఆగస్టు 31కి పదేళ్ళు. ఇంతచేసి ఇప్పటివరకు పూజ నాయికగా సందడి చేసిన సినిమాల సంఖ్య.. కేవలం డజను మాత్రమే. అయితే, ఈ ఏడాది మాత్రం మిస్ హెగ్డేకి ఎంతో ప్రత్యేకం కానుంది. ఎందుకంటే.. అన్నీ అనుకూలిస్తే ఈ ఒక్క క్యాలెండర్ ఇయర్ లోనే ఏకంగా సిక్స్ కొట్టేందుకు సిద్ధమైంది ఈ `డీజే` బ్యూటీ.
ఆ వివరాల్లోకి వెళితే.. ఏప్రిల్ 1న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి జంటగా నటించిన `ఆచార్య` థియేటర్స్ లోకి రాబోతుండగా.. అదే నెల 14న కోలీవుడ్ స్టార్ విజయ్ కి జోడీగా పూజ యాక్ట్ చేసిన తమిళ చిత్రం `బీస్ట్` సందడి చేయనుంది. అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ఆడిపాడిన `రాధే శ్యామ్` కూడా వేసవిలో విడుదలయ్యే అవకాశముందంటున్నారు. అదే విధంగా.. రణ్ వీర్ సింగ్ కి జతగా అభినయిస్తున్న బాలీవుడ్ బొమ్మ `సర్కస్` కూడా ఈ సంవత్సరం జూలై 15న రాబోతోంది. అంతేకాదు.. సూపర్ స్టార్ మహేశ్ బాబు పెయిర్ గా కనిపించబోతున్న `#SSMB 28`తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో జట్టుకట్టనున్న `భవదీయుడు భగత్ సింగ్` కూడా ఇదే క్యాలెండర్ ఇయర్ లో ఎంటర్టైన్ చేసే అవకాశముంది.
Also Read: డైరెక్ట్ రిలీజ్ కోసం 'రాధేశ్యామ్'కు ఓటీటీ దిగ్గజం రూ. 400 కోట్ల ఆఫర్?
మొత్తమ్మీద.. 2022లో పూజా హెగ్డే సిల్వర్ స్క్రీన్ పై సిక్స్ కొట్టబోతుందన్నమాట. మరి.. వీటిలో ఏయే సినిమాలు పూజా హెగ్డే స్థాయిని మరింతగా పెంచుతాయో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
