అఖిల్.. ప్రతి ఒక్కరూ మన మధ్య కెమిస్ట్రీ గురించి మాట్లాడుతున్నారు!
on Oct 20, 2021
"ఇప్పటిదాకా నన్ను గ్లామరస్ స్టార్ అంటూ వచ్చారు. అయితే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీ రిలీజయ్యాక నన్ను పర్ఫార్మింగ్ స్టార్ అంటుంటే చాలా హ్యాపీగా ఉంది" అని చెప్పింది పూజా హెగ్డే. అఖిల్, పూజ జంటగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' ఈ నెల 15న దసరా సందర్భంగా విడుదలై, ప్రేక్షకాదరణతో సూపర్ హిట్ దిశగా దూసుకువెళ్తోంది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం ఏర్పాటుచేసిన సక్సెస్ మీట్లో పూజ మాట్లాడింది.
"ఇంకో సక్సెస్ఫుల్ ఫిల్మ్‌లో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' ఒక గుడ్ ఫిల్మ్. ఈ మూవీ సక్సెస్ అవడం టీమ్ ఎఫర్ట్. విభ అనే బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇచ్చినందుకు గీతా ఆర్ట్స్‌కు థాంక్స్. ఇప్పటిదాకా పూజా గ్లామరస్ స్టార్ అంటూ వచ్చారు. ఈ ఫిల్మ్ తర్వాత చాలా మంది ఫోన్లు చేసిన నువ్వు పర్ఫార్మింగ్ స్టార్‌వి అని చెప్పారు. వాళ్లు అలా అనడం చాలా బాగుందనిపించింది. విభ అనే పాత్ర వల్లే ఇది సాధ్యమైంది. ఆ పాత్రను అలా డిజైన్ చేసిన డైరెక్టర్ భాస్కర్‌కు చాలా థాంక్స్." అని చెప్పింది పూజ.
తెలుగు దర్శకులు ఇటీవల స్త్రీల పాత్రలను చాలా బాగా చూపిస్తున్నారనీ, దీన్ని ఇలాగే కొనసాగించాలని కోరుతున్నాననీ ఆమె సూచించింది. "దానివల్లే మేం మరో లెవల్‌కు చేరుకుంటాం. ఇప్పటిదాకా నేను ఏ సినిమా చేసినా, నువ్వు చాలా అందంగా ఉన్నావ్ అని చెప్తూ వచ్చారు. ఈ సినిమా వచ్చాక, నువ్వు చాలా బాగా చేశావ్ అని, ఆ తర్వాత నువ్వు చాలా చక్కగా ఉన్నావ్ అని అంటున్నారు. నేను అందంగా ఉండటానికి నా తల్లితండ్రులు కారణం. నేను బాగా నటించాననే పేరు వచ్చిందంటే, అది నా ప్రయత్నం." అంది టాలీవుడ్ టాప్ యాక్ట్రెస్.
ఈ సందర్భంగా అఖిల్‌కు అభినందనలు తెలియజేసిందామె. "సో.. సో.. హ్యాపీ ఫర్ యు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్రల్ సక్సెస్ అయినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నీకు గ్లోరియస్ ఫ్యూచర్ ఉంటుందని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ మన స్క్రీన్ కెమిస్ట్రీ గురించి మాట్లాడుతున్నారు. పరస్పరం సౌకర్యంగా నటించడం వల్లే అది సాధ్యమైందనుకుంటాను." అని సంతోషంగా చెప్పింది పూజ.
Also Read