ఆ విషయం డైరెక్టర్‌నే అడగండి: పూజా హెగ్డే
on Mar 26, 2020

అనగనగా ఒక రాజు. ఆయనకు ఏడుగురు కొడుకులు. వేటకు వెళ్లి ఏడు చేపలు తెస్తారు. అందులో ఒక చేప ఎండలేదు... ఈ కథ గుర్తుందా? ఇంచుమించు ప్రభాస్20 ఫస్ట్ లుక్ విషయంలో అటువంటి కథే రన్నింగ్‌లో ఉంది. అసలు వివరాల్లోకి వెళితే... ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్20 సినిమా హీరోయిన్ పూజా హెగ్డే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రోగ్రామ్ పెట్టారు.
'ప్రభాస్20 అప్‌డేట్' అని పూజా హెగ్డేను ప్రభాస్ అభిమాని ఒకరు అడిగారు. అందుకు ఆవిడ సమాధానం చెప్పలేదు. సినిమా దర్శకుడు రాధాకృష్ణకు మరో ప్రశ్న వేశారు. "ఈయనే మా దర్శకుడు రాధాకృష్ణ. ఆయన్ను అడగడానికి ట్రై చేయండి. సార్... ఫస్ట్ లుక్ ఎప్పుడు బయటకు వస్తుంది?" అని రాధాకృష్ణను పూజా హెగ్డే ప్రశ్నించారు. ఇన్‌స్టాలో ఆయన అకౌంట్‌ను ట్యాగ్ చేశారు. హీరోయిన్ ప్రశ్నకు దర్శకుడు కూడా సమాధానం చెప్పలేదు. హీరో ప్రభాస్, ప్రొడక్షన్ హౌస్ యువి క్రియేషన్స్ ను అడగమని తప్పించుకున్నారు. అదీ సంగతి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



