బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కి చెక్ పెట్టిన పోలీసులు.. 11 మందిపై కేసులు నమోదు!
on Mar 17, 2025
గత కొన్నేళ్లుగా యూ ట్యూబ్‌లో రకరకాల వీడియోలు చేస్తూ విపరీతంగా ఫాలోవర్స్‌ని సంపాదించుకొని యూ ట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా ఛలామణి అవుతున్న కొందరు అధిక ఆదాయం కోసం సమాజానికి ప్రమాదకరంగా మారిన బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ డబ్బు దండుకుంటున్నారు. ఇటీవల ఈ విషయాన్ని ఐపిఎస్ అధికారి, ఆర్టీసీ ఎం.డి. సజ్జనార్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించడమే కాకుండా అలా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న వారి వివరాలు ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరారు. ఆ విధంగా ఎంతో మంది యూ ట్యూబర్లు బెట్టింగ్ చేస్తున్నారనే విషయాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అలాంటి వారిపై కొరఢా రaళిపిస్తున్నారు. ఇప్పటికే సజ్జనార్ సూచన మేరకు లోకల్ బాయ్ నానిపై కేసు పెట్టి రిమాండ్‌కి తరలించారు. ఇప్పుడు తెలంగాణ పోలీసులు 11 మందిపై కేసులు నమోదు చేశారు.
హర్షసాయి, విష్ణుప్రియ, రీతు చౌదరి, టేస్టీ తేజ, సుప్రీత, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, శ్యామల, కిరణ్ గౌడ్, సన్నీ యాదవ్, సుధీర్‌రాజు, అజయ్‌లపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఇటీవలికాలంలో ఎంతో బెట్టింగ్ యాప్‌ల బారిన పడి లక్షల్లో, కోట్లలో నష్టపోయారు. దాని ఫలితంగా కొందరు ఆత్మహత్యకు కూడా పాల్పడ్డారు. ఇకపై అలాంటి విషాదకరమైన ఘటనలు జరగకూడదని సజ్జనార్ ఈ సందర్భంగా తెలియజేస్తూ బెట్టింగ్‌లను ప్రోత్సహిస్తున్న ఎవరిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో యూ ట్యూబర్లలో ఆందోళన నెలకొంది. ఒక్కొక్కరుగా అందరి పేర్లూ వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి వారు సోషల్ మీడియాలో ఇంకా ఉన్నారని, వారిపై కూడా త్వరలోనే కేసులు పెట్టబోతున్నారని తెలుస్తోంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
