Home

»

Latest News

Peddi: విడుదలకు ముందే ‘పెద్ది’ విధ్వంసం.. ప్రీ-రిలీజ్ బిజినెస్‌తోనే రూ.450 కోట్లు!

Jun 1, 2026 3:42PM

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ‘ఉప్పెన’ ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ దగ్గర విడుదలకు ముందే సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా రికార్డు థియేట్రికల్ బిజినెస్ చేసింది. (Peddi Pre Release Business)

ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ హక్కుల బిజినెస్ వివరాలను గమనిస్తే, తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లో రామ్ చరణ్ మార్కెట్ స్టామినా ఏమిటో స్పష్టమవుతుంది. నైజాం ఏరియాలో ఈ సినిమా ఏకంగా రూ. 48 కోట్ల భారీ ధరకు థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకోగా, ఆంధ్రా ప్రాంతంలో రూ.63.25 కోట్ల రికార్డు స్థాయి బిజినెస్ జరిగింది. అలాగే రాయలసీమ హక్కులు రూ. 24 కోట్లకు అమ్ముడయ్యాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే రూ.135.25 కోట్ల బిజినెస్ చేసింది.

ఇక కర్ణాటకలో 17 కోట్లు, తమిళనాడులో 5.25 కోట్లు, కేరళలో 2 కోట్ల బిజినెస్ తో సత్తా చాటగా.. హిందీ + రెస్టాఫ్ ఇండియా మరో రూ.25 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. ఓవర్సీస్ లోనూ రూ.34 కోట్ల బిజినెస్ తో పెద్ది తన పవర్ చూపించింది. 

'పెద్ది' మూవీ వరల్డ్ వైడ్ గా రూ.218.50 కోట్ల థియేట్రికల్  బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం రూ.220 కోట్ల షేర్ (రూ.400 కోట్ల గ్రాస్) రాబట్టాల్సి ఉంది. 

కేవలం థియేట్రికల్ మార్కెట్ మాత్రమే కాకుండా నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా కూడా మేకర్స్ ఇన్వెస్ట్‌మెంట్‌కు ముందే భారీ లాభాలు చేకూరినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) అత్యంత భారీ డీల్‌తో దక్కించుకుంది. నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ. 115 కోట్ల నుండి రూ. 130 కోట్ల మేర డిజిటల్ రైట్స్‌ను లాక్ చేసినట్లు సమాచారం. అలాగే శాటిలైట్ హక్కుల ద్వారా రూ. 50 కోట్ల నుండి రూ. 70 కోట్లు, ఆడియో హక్కుల ద్వారా రూ. 35 కోట్లు దక్కినట్లు తెలుస్తోంది.

మొత్తంగా థియేట్రికల్, నాన్-థియేట్రికల్ కలుపుకుని పెద్ది మూవీ దాదాపు రూ.450 కోట్ల బిజినెస్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com