Home

»

Latest News

తాగుబోతు ప్రేమకి ఇంత డిమాండ్ ఎందుకు..IMDb లో 8.7 రేటింగ్ 

Jun 1, 2026 3:30PM

 

కొన్ని చిత్రాలు థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా ఓటీటీ వేదికగా మాత్రం సంచలనాలు సృష్టిస్తుంటాయి. సరిగ్గా ఇదే మ్యాజిక్‌ని  రిపీట్ చేస్తోంది టాలీవుడ్  రొమాంటిక్ డ్రామా మూవీ ‘డ్రింకర్ సాయి’. "బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్" అనే డిఫరెంట్ ట్యాగ్‌లైన్‌తో, కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై దుమ్మురేపుతోంది. గతేడాది 2024 డిసెంబర్ 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అక్కడ యావరేజ్ టాక్‌తో ముగిసింది. కానీ తాజాగా మే 27న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) లో స్ట్రీమింగ్ ప్రారంభమైన తర్వాత, ఈ చిత్రం సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ‘ఫ్రీ ఆన్ జీ5’ విభాగంలో అఫీషియల్‌గా టాప్-1 పొజిషన్‌లో ట్రెండ్ అవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

సాధారణంగా చిన్న సినిమాలకి ఓటీటీలో అంతగా రేటింగ్స్ రావు, కానీ డ్రింకర్ సాయి ఏకంగా 8.7 ఐఎమ్‌డీబీ (IMDb) రేటింగ్‌ని దక్కించుకొని ట్రేడ్ వర్గాలని సైతం విస్మయానికి గురిచేసింది. ఈ భారీ రేటింగ్‌తో ప్రస్తుతం నెట్టింట ఈ సినిమా పేరు గట్టిగా వినిపిస్తోంది. ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ సంయుక్తంగా నిర్మించారు. ఒక క సాధారణ ప్రేమికుడి కథకి  ఆల్కహాల్ ఎడిక్షన్, ఎమోషనల్ డ్యామేజ్, సామాజిక సందేశాన్ని జోడించి దర్శకుడు ఈ చిత్రాన్ని మలిచారు.

కథ విషయానికి వస్తే, సాయి (ధర్మ మహేష్) అనే ఒక యువకుడు తన తల్లిదండ్రుల ఆస్తిని నమ్ముకుని, బాధ్యత లేకుండా నిత్యం తాగుడుకు బానిసగా మారి తిరుగుతుంటాడు. నిరంతరం మద్యం మత్తులో తూలుతూ, గొడవలు పడుతూ ఉండే సాయిని అతని బాబాయ్ (శ్రీకాంత్ అయ్యంగార్) ఎప్పటికప్పుడు పోలీస్ కేసుల నుండి కాపాడుతుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో సాయి జీవితంలోకి భాగీ (ఐశ్వర్య శర్మ) అనే క్రమశిక్షణ గల మెడికల్ స్టూడెంట్ ప్రవేశిస్తుంది. ప్రకృతి వైద్యం (నాచురోపతి)ని బలంగా నమ్మే భాగీని చూడగానే సాయి వన్‌సైడ్ లవ్‌లో పడిపోతాడు. ఆమె చుట్టూ తిరుగుతూ వేధించడం మొదలుపెడతాడు. అయితే సాయి కోపానికి, అతని ప్రవర్తనకు భయపడిన భాగీ, ఇష్టం లేకపోయినా కేవలం భయంతోనే అతని ప్రేమిస్తున్నట్లు నటిస్తుంది.

also read: Shivani Nagaram: లిటిల్ హార్ట్స్ బ్యూటీ కి బంపర్ ఆఫర్.. తమిళ్, కన్నడ స్టార్స్ తో

అక్కడి నుండి ఈ ఇద్దరి మధ్య ఎలాంటి ఎమోషనల్ డ్రామా నడిచింది? భాగీ నిజంగానే సాయిని ప్రేమించిందా? ఒక తాగుబోతును ఆమె అంగీకరించిందా? చివరకు సాయి తన వ్యసనాన్ని వదిలి ఎలా మారాడు? అనే ఆసక్తికర అంశాలతో 2 గంటల 28 నిమిషాల నిడివితో ఈ సినిమా సాగుతుంది. ఈ చిత్రంలో డ్రింకర్ సాయి పాత్రలో ధర్మ మహేష్ అందించిన నటన అద్భుతమనే చెప్పాలి. ఒక తాగుబోతుగా, ప్రేమ విఫలమైన యువకుడిగా అతని హావభావాలు, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. నూతన నటి ఐశ్వర్య శర్మ కూడా తన నటనతో మెప్పించింది. శ్రీ వసంత్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్  సినిమాలోని భావోద్వేగాలను మరింత ఎలివేట్ చేయగా, ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రఫీ రిచ్ విజువల్స్ అందించింది. ప్రస్తుతం వీకెండ్ వినోదం కోసం ఈ ఇంటెన్సివ్ లవ్ స్టోరీ ఓటీటీ ప్రియులకి  బెస్ట్ ఛాయిస్‌గా మారింది.

 


   

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com