పాయల్ 'కాళరాత్రి'!
on Jul 14, 2020
పాయల్ రాజ్పుత్ తెలుగులో కొత్త సినిమాకు సంతకం చేసింది. ప్రేక్షకులు తనను ఎటువంటి పాత్రలలో చూడాలని కోరుకుంటారో? అటువంటి పాత్రను ఆ సినిమాలో చేస్తున్నానని ఆమె చెప్పింది. కథ, అందులో క్యారెక్టర్ ఆమెకు అంత బాగా నచ్చాయట. ఆ సినిమా చూసిన మరుక్షణమే కనెక్ట్ అయ్యానని పాయల్ చెప్పింది. సినిమా చూడటమేమిటి? అని సందేహం వచ్చిందా!? ఆమె చేయబోయేది ఓ రీమేక్ సినిమా. కన్నడలో 'కాళరాత్రి'గా విడుదలైన సినిమా తెలుగు రీమేక్ లో పాయల్ నటించనున్నది.
తెలుగులో ఓ కొత్త సినిమాతో పాటు పంజాబీలో ఓ మ్యూజిక్ వీడియో చేయనుంది. ఇటీవల దానికీ సంతకం చేసింది. నెక్స్ట్ మంత్ ఆ వీడియో షూట్ చేస్తామని పాయల్ పేర్కొంది. లాక్డౌన్ టైమ్లో అవకాశాలు వచ్చినా... కరోనాకు భయపడి అంగీకరించలేదని, ఎన్నాళ్ళు ఇలా ఇంటిలో ఉంటాం? ఎక్కడో ఒక చోట మళ్ళీ మొదలుపెట్టాలని ధైర్యం చేసి షూటింగుకు వెళ్ళడానికి సిద్ధమయ్యానని ఆమె తెలిపింది. పంజాబీలో సినిమా అవకాశాల కోసమే పాయల్ ఆ వీడియో చేయడానికి అంగీకరించింది.