Home

»

Latest News

చెన్నై టాక్: రజనీ కబాలికి డివైడ్ టాక్

Jul 22, 2016 11:06AM

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న సూపర్‌స్టార్ రజనీకాంత్ కబాలి ఇవాళ థియేటర్లలోకి వచ్చింది. ఉదయం చెన్నైలో స్పెషల్ షోలను వేయడంతో ఈ సినిమాకు సంబంధించిన చెన్నై టాక్ బయటకు వస్తోంది. ఈ సినిమా రజనీ అభిమానులను జోష్‌లో ముంచితే సాధారణ ప్రేక్షకులు మాత్రం కబాలిపై అంత సంతృప్తి వ్యక్తపరచకపోవడంతో ఈ సినిమాకు డివైడ్ టాక్ మొదలైందన్న వార్తలు వస్తున్నాయి.

మద్రాస్ టాక్ ప్రకారం మలేషియాలో ఉన్న తమిళుల కోసం పోరాడే వ్యక్తిగా రజనీ సినిమాలో కనిపిస్తారు.  ఫస్టాఫ్ ఎమోషనల్ స్క్రీన్‌ప్లేతో, ఊహించని ట్విస్ట్‌లతో ఇంటర్వెల్ అప్పుడే వచ్చిందా అన్నట్టు నడిచిందని తెలుస్తోంది. కూల్‌డ్రింక్, సమోసాలు తిని తర్వాతి పార్ట్ ఎలా ఉంటుందా అన్న ఆశతో సీట్లలో కూర్చున్న అభిమానులకు సెకండాఫ్ నేరేషన్ స్లోగా అనిపించినా, కొంత అసహనం కలిగిస్తుంది అని అంటున్నారు. దానికి తోడు సినిమా సగటు అభిమానికి న్యాచురల్‌గా అనిపించలేదు. రజనీని అందంగా చూపించాలనే తాపత్రయంతో ఓవర్‌ మేకప్‌ వేయడంతో సహజత్వం లోపించింది. సూపర్ స్టార్ పాత సినిమాల్లోని హైలెట్ సీన్లను కాపీ పేస్ట్ చేయడంతో అభిమానులకు బోర్ తెప్పించాయి. మొత్తానికి అనుకున్నంత స్థాయిలో అయితే కబాలి లేదని తెలుస్తోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com