పవన్‌కి క్రిష్ రిక్వెస్ట్?
on Mar 13, 2020

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కి దర్శకుడు క్రిష్ ఒక రిక్వెస్ట్ చేశారట. అదీ పవన్ వెయిట్ విషయంలో. ఫైట్ సీన్స్ కోసం కొంత బరువు తగ్గితే బాగుంటుందని సూచించారట. ఇప్పుడదే పనిలో పవన్ ఉన్నారని యూనిట్ ఖబర్. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఏయం రత్నం నిర్మిస్తున్న సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఒక స్టూడియోలో జరుగుతోంది. రాబిన్ హుడ్ టైప్ కథతో స్వాతంత్ర్యానికి ముందు జరిగిన కథతో సినిమా తెరకెక్కుతోంది.
క్రిష్ సినిమాలో పవన్ కళ్యాణ్ రెండు గెటప్పుల్లో కనిపించనున్నారు. ఒకటి గుబురు గడ్డంతో కనిపించే గెటప్. మరొకటి గడ్డం తీసేసి జులపాలతో కనిపించే గెటప్. గడ్డంతో కనిపించే సన్నివేశాలను ఫస్ట్ షెడ్యూల్‌లో షూట్ చేశారు. గడ్డంతో కనిపించేది కాసేపే అని టాక్. ప్రజెంట్ గడ్డం లేని సీన్స్ తీస్తున్నారు. ఈ లుక్‌లో ఫైట్ సీన్స్ కోసం బరువు తగ్గితే బావుంటుందనేది క్రిష్ ఆలోచన. పవన్‌కి ఆ విషయం చెప్పగా... బరువు తగ్గే పనిలో పడ్డారట. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పవన్ కొంచెం ఒళ్లు చేశారు. ఆయన కూడా వెయిట్ తగ్గాలని డిసైడ్ అయ్యారట.
పవన్ కళ్యాణ్ కెరీర్లో భారీ బడ్జెట్ సినిమా ఇదే అవుతుందని టాక్. సుమారు 150 నుండి 170 కోట్ల రూపాయలు సినిమా మేకింగ్ కోసం ఖర్చు చేస్తున్నారు. ఇంతకు ముందెప్పుడూ పవన్ చేయనటువంటి ఫైట్స్ ఇందులో చేస్తున్నారట. అవెంజర్స్ లో ఐరన్ మ్యాన్-థార్ టైప్ ఫైట్స్ ఉన్నాయట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



