Home

»

Latest News

సైమాలో పవన్ ఫ్యాన్స్‌‌కు వార్నింగ్ ఇచ్చిన బన్నీ..

Jul 2, 2016 11:19AM

మెగాహీరోలు అల్లుఅర్జున్, పవన్ కళ్యాణ్‌లకు మధ్య గత కొంతకాలంగా కోల్డ్‌వార్ నడుస్తుందన్న విషయం అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ "పవర్ స్టార్" అని విజయవాడలో జరిగిన "సరైనోడు" సక్సెస్ మీట్ లో అరుస్తుంటే.. "చెప్పను బ్రదర్" అన్న అల్లు అర్జున్ ని సోషల్ మీడియాలో దాదాపుగా ఆడేసుకొన్నారందరూ.  మెగా బ్రదర్ నాగబాడు కుమార్తె నిహారిక నటించిన "ఒక మనసు" ఆడియో వేడుకలో ఈ వార్ ముదిరి పాకానపడి బన్నీ బరస్ట్ అయ్యాడు. బన్నీ మాట్లాడుతుండగా పవన్ ఫ్యాన్స్ పదే పదే పవర్‌స్టార్..పవర్‌స్టార్ అని అరవడంతో సహనం కోల్పోయిన అర్జున్ పవర్‌‌స్టార్ పట్ల తనకున్న ఇష్టాన్ని, అభిమానాన్ని గురించి చెప్పి..అనవసర రాద్దాంతం చేస్తున్న వారి నోరు మూయించారు . దీంతో రెచ్చిపోయిన పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా అల్లుఅర్జున్‌ని ఒక ఆటాడుకున్నారు. ఆ వివాదం కొంతకాలం తర్వాత సద్దుమణిగిపోయింది.

అయితే మరోసారి బన్నీని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు పవన్ అభిమానులు. సింగపూర్‌లో జరిగిన "సైమా అవార్డ్స్" కార్యక్రమంలో రుద్రమదేవి సినిమాలో పోషించిన "గోన గన్నారెడ్డి" పాత్రకు గాను క్రిటిక్స్ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు అర్జున్. అనంతరం బన్నీ మాట్లాడుతుండగా కొందరు ఆకతాయిలు మళ్లీ పవర్‌స్టార్..పవర్‌స్టార్ అంటూ గోల చేశారు. వారి గొడవతో ఇబ్బందిపడిన బన్నీ "గమ్మునుండవోయ్..మాట్లాడనీ" అంటూ వారి నోరు మూయించారు. అప్పుడు సోషల్ మీడియాలో "చెప్పను బ్రదర్" అన్న మాట ట్రెండ్ అయినట్టే..తాజాగా "గమ్మునుండవోయ్" అన్న మాటలు హల్‌చల్ చేస్తున్నాయి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com