Home

»

Latest News

బోయపాటికి చేతికి చిరు ‘కత్తి’..!

Jul 2, 2016 11:30AM

ప్రస్తుతం వివి.వినాయక్ దర్శకత్వంలో తమిళ హిట్ సినిమా "కత్తి" రీమేక్ లో నటిస్తున్న చిరంజీవి అప్పుడే తన 151వ సినిమాకి కూడా రంగం సిద్ధం చేసుకొంటున్నాడని తెలుస్తోంది. సంక్రాంతికి మెగా 150వ సినిమా విడుదలవుతుండగా.. ఫిబ్రవరి నుంచి 151వ సినిమా మొదలవ్వనుందని సమాచారం. 

ఈ తాజా చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. "సరైనోడు" ఆడియో వేడుకకు విచ్చేసిన చిరంజీవి అప్పుడే "బోయపాటి నాకోసం ఒక కథ సిద్ధం చేశాడట, త్వరలో ఇద్దరం కలిసి పనిచేస్తాం" అని ప్రకటించాడు. బోయపాటి ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా అనంతరం చిరంజీవి సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు మోదల్పెట్టనున్నాడు బోయపాటి!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com