అయోమయానికి గురి చేస్తోన్న పవన్!
on Feb 12, 2023
.webp)
పవన్ ఇటు సినిమాలతోనూ అటు రాజకీయాలతోనూ బిజీ బిజీగా ఉన్నారు. తన వారాహి రథంపై యాత్ర ప్రారంభించారు. ఏపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బయలుదేరారు. తెలంగాణతో పాటు ఏపీ రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తానని ప్రకటించారు. అటు సినిమాలతో అటు రాజకీయాల్లో బిజీ బిజీగా పవన్ గడుపుతున్నారు. ఆయన దేనికి టైం కేటాయిస్తారు? ఎప్పుటి నుంచి కేటాయిస్తాడు? అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కనీసం ఒక్క సినిమా పూర్తి చేసి విడుదల చేస్తే తమ హీరోను వెండి తెరపై చూడొచ్చని ఆశపడుతున్నారు. ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 2020లో ప్రారంభమైంది. ఇప్పటివరకు పూర్తి కాలేదు. వాయిదాలు పడుతూ వస్తుంది. ఈ సినిమాని వెంటనే పూర్తి చేయాలని పవన్ నిర్ణయించుకున్నాడు.
ఎలాగైనా సమ్మర్ కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెగ తాపత్రయ పడుతున్నారు. హరిష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్, సముద్రఖనీ దర్శకత్వంలో వినోదాయ సిత్తం రీమేక్, సుజిత్ ఓ జీ ఇలా బిజీబిజీగా ఉన్నారు. హీరో పవన్ కళ్యాణ్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క తెలుగులోనే కాదు సౌత్ మొత్తం ఆయన మేనరిజం స్టైల్ చూసి ఫ్యాన్స్ అయ్యారు. ఆయన ఒక పక్క పాలిటిక్స్ మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు 2024 ఎన్నికల లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. పవన్ కళ్యాణ్ కం బ్యాక్ తర్వాత ప్రకటించిన చిత్రాలలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాలు మాత్రమే విడుదలయ్యాయి. ఆ తర్వాత ఆయన సినిమా ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి సరైన క్లారిటీ కోసం ఆయన అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



