'వారసుడు' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవర్ స్టార్!
on Dec 15, 2022

కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'వారిసు'. తమిళ్ లో రూపొందిస్తోన్న ఈ చిత్రాన్ని తెలుగులో 'వారసుడు' పేరుతో డబ్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఈ మూవీ ప్రీ రిలీజ్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కానున్నాడనే న్యూస్ సంచలనంగా మారింది.
సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య', 'వీర సింహా రెడ్డి' వంటి బడా తెలుగు సినిమాలు వస్తుంటే.. దిల్ రాజు తన డబ్బింగ్ మూవీ 'వారసుడు'ను భారీ స్థాయిలో విడుదల చేయడానికి సిద్ధమవ్వడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో దిల్ రాజు.. పవన్ కళ్యాణ్ ని వారసుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడనే వార్తలు ఆసక్తికరంగా మారాయి. పవర్ స్టార్ ని తీసుకొస్తే తెలుగులో 'వారసుడు'కి బోలెడంత హైప్ రావడంతో పాటు.. తనపై వస్తున్న విమర్శలు కూడా తగ్గిపోతాయని దిల్ రాజు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల చివరి వారంలో లేదా జనవరి మొదటి వారంలో హైదరాబాద్ లో ఈ వేడుక జరిగే అవకాశముందని అంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



