పవన్ కరుణిస్తాడా...?
on Mar 5, 2018
.jpg)
పాపం వరుస ఫ్లాప్ లతో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కెరీర్ ప్రస్తుతం కష్టాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇక వరుస ఫ్లాప్స్ వస్తుండంతో... పవన్ కళ్యాణ్ తేజని పిలిచి మరీ మందలించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. సరైన కథలు ఎంపిక చేసుకోవాలని, కేరీర్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని హెచ్చరించారు. దీంతో ఇప్పుడు తన ఆశలన్నీ కరుణాకరన్ తీస్తున్న సనిమాపైనే పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమా విషయంలో పవన్ ఇప్పటికే కరుణాకరన్ కు కూడా తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా.. ఈ సినిమా కోసం తేజ్ పవన్ సాయం తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ చిత్ర ఆడియో వేడుకకు పవన్ రప్పించాలని చూస్తున్నాడట. ఆడియో వేడుకకు చాలా టైం ఉంది. అయితే ప్రస్తుతం పవన్ సినిమాలకు దూరంగా పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టారు. తాను ఇకపై సినిమాలు తీస్తాడో..? లేదో..? కూడా తెలియదు. పూర్తిగా రాజకీయాలకు పరిమితమైపోయారు. అందుకే... ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలు పెట్టాడట తేజ్. ఆడియో వేడుకుకు ఇంకా చాలా సమయం ఉన్నపటికీ పవన్ కళ్యాణ్ కు ఉన్న పొలిటికల్ కమిట్మెంట్స్ కారణంగా తేజు ఇప్పటి నుంచే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరి పవన్ కరుణిస్తాడో..?లేడో..? చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



