.jpg)
కోన రైటర్‌కి రైటర్ గా కావల్సినంత స్టార్ డమ్ ఉంది. సినిమాకి కోటికి తక్కువ కాకుండా అందుకోగలిగే సత్తా ఉంది. అయితే.. ఇప్పుడాయన దర్శకత్వం వైపు దృష్టి పెట్టాడు. ఓ స్టార్ హీరోతో ఫక్తు కమర్షియల్ సినిమా తీసి, దర్శకుడిగానూ ఓ ఊపు ఊపేద్దామని భారీ స్కెచ్చులు వేస్తున్నాడు. అందులో భాగంగా పవన్‌కల్యాణ్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నట్టు టాలీవుడ్ టాక్. గత రెండేళ్ల నుంచీ పవన్ - కోన మధ్య స్నేహం బలపడుతోంది. కోన వెంకట్ నిర్మాణంలో వచ్చిన గీతాంజలి, శంకరాభరణం చిత్రాల ప్రమోషన్లలో పవన్‌ని బాగా వాడుకొన్నాడు కోన. ఆ సమయంలో `నీతో సినిమా చేస్తా..` అని పవన్ చేత కూడా అనిపించుకొన్నాడు. అప్పటి నుంచీ పవన్‌కి సరిపడ కథ సిద్దం చేయడానికి కసరత్తులు చేస్తూనే ఉన్నాడు. పవన్ - దాసరి కాంబినేషన్లో ఓ సినిమా పట్టాలెక్కాల్సివుంది. అందుకోసం కోన రెండు మూడు కథలు రెడీ చేశాడట. కథ నచ్చితే.. డైరెక్షన్ ఛాన్స్ కూడా ఇస్తారని ఆశలు పెట్టుకొన్నాడు కోన. ఇటీవల దాసరిని కలసి కోన కథ చెప్పాడట. దాసరి కూడా సానుకూలంగానే స్పందించారని టాక్. ఇక పవన్ ఓకే అంటే కోన పంట పండినట్టే. మరి పవన్ ఏమంటాడో చూడాలి.





.jpg)
