Home

»

Latest News

చిరు సెట్లో... చ‌ర‌ణ్ రాజ‌కీయాలు

Oct 14, 2016 12:45PM

 

చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెం.150కి చ‌ర‌ణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే.  అయితే కేవ‌లం నిర్మాత‌గా త‌న పేరు చూసుకోవ‌డ‌మే కాదు, చిరు సినిమాకి సంబంధించిన అన్ని విష‌యాల్లోనూ చర‌ణ్ ప్ర‌మేయం ఉంటోంద‌ట‌. ఆఖ‌రికి ఈ సినిమాలో ఐటెమ్ గాళ్ గా కేథ‌రిన్ స్థానంలో ల‌క్ష్మీరాయ్‌ని తీసుకురావ‌డం వెనుక కూడా చ‌ర‌ణ్ మాస్ట‌ర్ మైండ్ ఉంద‌ని స‌మాచారం. కేథ‌రిన్ అయితే బాగుంటుంద‌న్న వినాయ‌క్ ఆలోచ‌న‌కు ముందు చ‌ర‌ణ్ అంగీక‌రించినా.. చివ‌రి క్ష‌ణాల్లో కేథ‌రిన్‌ని ప‌క్క‌న పెట్టాడ‌ట‌. కేథ‌రిన్ డాన్స్ స‌రిగా చేయ‌ద‌న్న సాకు చూపి ఆమెను తొల‌గించి.. ల‌క్ష్మీరాయ్‌ని చివ‌రి క్ష‌ణాల్లో దింపాడ‌ని తెలుస్తోంది. చ‌ర‌ణ్ అతి చొర‌వ‌.. అటు వినాయ‌క్ కీ న‌చ్చ‌డం లేద‌ని, ఐటెమ్ సాంగ్ విష‌యంలో వినాయ‌క్ గుర్రుగా ఉన్నాడ‌ని తెలుస్తోంది. ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిజైన‌ర్ గా ప‌ని చేస్తున్న చిరు కుమార్తె  సుస్మిత‌కు, కేథ‌రిన్‌కీ మ‌ధ్య కాస్త క‌మ్యునికేష‌న్ గ్యాప్ వ‌చ్చింద‌ని, అది మ‌న‌సులో పెట్టుకొనే కేథ‌రిన్‌ని త‌ప్పించారన్న ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే... ఈ వ్య‌వ‌హారం మొత్తం చ‌ర‌ణ్ న‌డిపించాడ‌ని, సెట్లో చ‌ర‌ణ్ మ‌రో ద‌ర్శకుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇది వ‌ర‌కుచ‌ర‌ణ్ సినిమా అన‌గానే చిరు ప్ర‌మేయం ఉండేది. చిరు కూడా ఇలానే అన్ని విష‌యాల్లోనూ క‌ల‌గ చేసుకొనేవాడు. ఇప్పుడు ఆ సీన్ రివ‌ర్స్ అయ్యింద‌న్న‌మాట‌. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com