Home

»

Latest News

ఇజం :  సెన్సార్ రివ్యూ

Oct 14, 2016 11:35AM

 

ప‌టాస్‌తో ప‌దేళ్ల త‌ర‌వాత ఓ హిట్ కొట్టి మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చాడు క‌ల్యాణ్ రామ్‌. ఆ సంతోషం ఎక్కువ కాలం నిల‌వ‌లేదు. ప‌టాస్ త‌ర‌వాత వ‌చ్చిన షేర్ య‌థావిథిగా డిజాస్ట‌ర్ అయ్యింది.  వ‌రుస ఫ్లాపుల‌తో ఉన్న పూరికి టెంప‌ర్ కాస్త రిలీఫ్ ఇచ్చింది. అయితే ఆ త‌ర‌వాత ష‌రా మామూలే. జ్యోతిల‌క్ష్మి, లోఫ‌ర్ సినిమాలు పూర్తిగా నిరాశ ప‌రిచాయి. ఇప్పుడు వీరిద్ద‌రి ఆశ‌ల‌న్నీ ఇజం పైనే. క‌ల్యాణ్ రామ్ మ‌ళ్లీ తేరుకోవాల‌న్నా.. పూరికి మ‌ళ్లీ పెద్ద సినిమాలు ప‌డాల‌న్నా... ఇజంతో హిట్టు ప‌డాల్సిందే. ఈ సినిమా ఈనెల 21న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. తాజాగా సెన్సార్ కూడా పూర్తి చేసుకొంది. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది?  సెన్సార్ రిపోర్ట్ ఏమిటి?  ల్యాబ్ వ‌ర్గాలు ఏం చెబుతున్నాయి?  అవ‌న్నీ ఒక్క‌సారి చూద్దాం.

* ఇజం సినిమాకి సెన్సార్ బోర్డు యు బై ఏ స‌ర్టిఫికెట్ మంజారు చేసింది. నిడివి రెండుగంట‌ల ప‌ది నిమిషాలు మాత్ర‌మేన‌ట‌.

* ఫ‌స్టాఫ్ పూరి మార్కు కామెడీ, హీరోయిజంతో స‌ర‌దా స‌ర‌దాగా సాగిపోయింద‌ట‌. ఫ‌స్టాఫ్‌లో పెద్ద క‌థేం లేదని... అయితే సెకండాఫ్ లో మాత్రం పూరి త‌న స‌త్తా చాటాడ‌ని లాబ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

* న‌ల్ల‌థ‌నం బ్యాక్ డ్రాప్‌లో న‌డిచే స్టోరీ ఇది. విదేశాల్లో మూలుగుతున్న కొన్ని ల‌క్ష‌ల కోట్ల‌ని హీరో ఒక్క‌డే ఎలా.. స్వ‌దేశం తీసుకొచ్చాడు, ఇక్క‌డ ఎలాంటి సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టాడ‌న్న‌ది మెయిన్ కాన్సెప్ట్‌.

* బ్లాక్ మ‌నీ కోస‌మే కాదు... మీడియాలో హెచ్చుమీరుతున్న పోటీ త‌త్వంపైనా కొన్ని సెటైర్లు ప‌డ్డాయ‌ట‌. అవి ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయ‌ని టాక్‌.

* క‌ల్యాణ్ రామ్ క్యారెక్ట‌రైజేష‌న్ ఇడియ‌ట్‌లో ర‌వితేజ‌, పోకిరిలో మ‌హేష్ బాబుని పోలి ఉంద‌ట‌. అయితే ఇలాంటి పాత్ర క‌ల్యాణ్ రామ్ ఇది వ‌ర‌కు చేయ‌లేదు కాబ‌ట్టి కొత్తగా ఫీల‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. క‌థానాయిక పాత్ర గ్లామ‌ర్‌కే ప‌రిమితం అయ్యింద‌ని, జ‌గ‌పతి క్యారెక్ట‌ర్‌కీ అంత సీన్ లేద‌ని తెలుస్తోంది.

* సెకండాప్ అక్క‌డ‌క్కడ డ‌ల్ అయ్యింద‌ని, అయితే క్లైమాక్స్ లో కోర్టు సీను ఈ సినిమాకే హైలెట్ గా నిల‌వ‌బోతోంద‌ని స‌మాచారం. దాదాపు పావు గంట పాట సాగే ఆ సీన్‌... న్యాయ వ్య‌వ‌స్థ‌పైనా మీడియాపైనా, రాజ‌కీయ నాయ‌కుల‌పైనా సెటైర్లు వేయ‌డానికి ఉప‌యోగించుకొన్నాడ‌ట‌.

ఓవ‌రాల్ గా పూరి మార్క్ సినిమా ఇద‌ని, క‌నీసం యావ‌రేజ్ టాక్ తో అయినా బ‌య‌ట‌ప‌డ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.
మ‌రి ఈ సినిమా చూసిన ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కులు ఏమంటారో..??

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com