పవన్ కళ్యాణ్ డిస్కౌంట్ ఇచ్చాడా..?
on Jan 28, 2016
పవన్ కళ్యాణ్, నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ మధ్య ఏర్పడ్డ డబ్బు వివాదం ముగిసినట్టే కనిపిస్తోంది. తనకు రావాల్సిన బకాయి ఇంకా చెల్లించలేదని పవన్ కళ్యాణ్, బివిఎస్ఎన్ ప్రసాద్ పై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి సమస్యను పరిష్కరించామని రాజేంద్రప్రసాద్ చెప్పారు. పవన్ కళ్యాణ్ నుండి తమకు అందిన ఫిర్యాదును ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు పంపి సమస్య పరిష్కారించామని రాజేంద్రప్రసాద్ తెలిపారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ నిర్మాతకి డిస్కౌంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తనకు ఇవ్వాల్సిన రెండు కోట్ల రూపాయలకి గాను పవన్ రూ కోటి యాభైలక్షల రూపాయలు మాత్రమే తీసుకున్నారని.. మిగిలిన యాభై లక్షలు డిస్కౌంట్ ఇచ్చారని చెపుతున్నారు. మరి అది ఎంత వరకూ నిజమో తెలియాలి.