కీరవాణికి ధన్యవాదాలు తెలిపిన పవన్‌కళ్యాణ్!
on Sep 30, 2024
తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడారు అనే విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో మనోవేదనకు గురయ్యారు. మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల అమితమైన గౌరవం ఉన్న పవన్‌కళ్యాణ్ సాక్షాత్తూ శ్రీవేంకటేశ్వరస్వామికే ఇలాంటి అపచారం జరగడం పట్ల ఆందోళన చెందారు. అందుకే ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దానికి ప్రజల మద్దతు బాగా లభిస్తోంది. జనసేన నాయకులతోపాటు ఆధ్యాత్మిక చింతన ఉన్న ఎంతోమంది ఆలయాల్లో పూజలు, హోమాలు, భజనలు చేస్తున్నారు. ‘ఓం నమో నారాయణాయ’ మంత్రాన్ని పఠిస్తున్నారు. దానికి అనువుగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఆ మంత్రం ఆడియో రికార్డింగ్ చేయించారు.
దీనిపై పవన్‌కళ్యాణ్ స్పందించారు. అందరికీ ఉపయోగపడే విధంగా ఓం నమో నారాయణాయ మంత్రాన్ని ఆడియో ఫార్మాట్‌లో రికార్డ్ చేసినందుకు ఎం.ఎం.కీరవాణికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు పవన్‌కళ్యాణ్. ఆ మంత్రం ఆడియో ఎంతో భక్తిభావంతో సాగిందన్నారు. దీన్ని రూపొందించడంలో సహాయపడిన సంగీత కళాకారులకు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు తెలియజేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



