'చిన్నదాన నీ కోసం'లో పవన్ కళ్యాణ్
on Dec 23, 2014
టాలీవుడ్ లో వరుస విజయాలు సాధిస్తూ మంచి జోరుమీదున్న నితిన్ లేటెస్ట్ మూవీ 'చిన్నదాన నీ కోసం'. ఈ చిత్రం ఈ నెల 25న విడుదలవుతోంది. ఇక హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పనక్కరలేదు. ఈ మధ్య ఎక్కడా మైక్ దొరికితే చాలు నేను పవన్ అభిమానిని అంటూ, ఆయన వల్లే సినిమాల్లోకి వచ్చానంటూ చెబుతుంటాడు. లేటెస్ట్ గా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం..చినదాన నీకోసం సినిమాలో పవన్ ఫ్యాన్స్ కోసం ఓ సర్ ప్రయిజ్ ప్లాన్ చేశాడట. ఈ సినిమా సెకండాఫ్ లో పవన్ కళ్యాణ్ అలా మెరిసి మాయమవుతాడట. అయితే నితిన్ సినిమాలో పవన్ కనిపించడమా అని ఆశ్చర్యపోనక్కరలేదు. ఎందుకంటే ఈ సినిమా డైరెక్టర్ కరుణాకరన్ అంటే పవన్ కూడా ఇష్టమే.. అందుకోసమే ఇందుకు ఓకె అన్నాడని తెలుస్తోంది. అయితే పవన్ నేరుగా కామియోగా కనిపిస్తాడా? లేక ఆయన సినిమా సీన్ ఇందులో పెట్టారా అన్నది అభిమానుల సందేహం.