Home

»

Latest News

బాబోయ్! బొమ్మరిల్లుతో పోల్చేసాడేంటి!

Aug 1, 2016 10:08AM

"మాయాబజార్, లవకుశ, దేవదాసు" లాంటివి నిన్నటి తరానికి క్లాసిక్ సినిమాలేలాగో.. "బొమ్మరిల్లు" నేటి తరానికి ఒక క్లాసిక్ సినిమా అన్నమాట. "బొమ్మరిల్లు"లోని తండ్రీకొడుకుల అనుబంధం, ప్రేమికుల ప్రేమానుబంధం వంటివి మళ్ళీ ఏ దర్శకుడూ వెండితెరపై మరోమారు ఆవిష్కరించలేరేమో. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ఆ సెంటిమెంట్ ను రిపీట్ చేయాలని కొందరు ప్రయత్నించినప్పటికీ.. సాధ్యపడలేదు. 

అయితే.. నిన్న జరిగిన "శ్రీరస్తు శుభమస్తు" ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. "శ్రీరస్తు శుభమస్తు" చూస్తుంటే "బొమ్మరిల్లు" గుర్తొచ్చింది" అని చెప్పారు. అన్న చిరంజీవికి ఏమైనా అనిపించిందో లేదో తెలియదు కానీ.. విన్నవారు మాత్రం ఒక్కసారిగా నోరెళ్ళబెట్టారు. మొన్న విడుదలైన ట్రైలర్ లో హీరో శిరీష్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని దొరికినప్పుడల్లా సాధ్యమైనంతవరకూ నలిపేశాడు. మరి అలాంటి టిపికల్ రొమాన్స్ ఉన్న ఈ సినిమాను "బొమ్మరిల్లు" లాంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో కంపేర్ చేయడం ఏంటో? అని అందరూ చెవులు కోరుక్కొంటున్నారు!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com