పవన్ కళ్యాణ్ ని అవమానించింది ఎవరు.. తెరవెనుక ఇంత జరిగిందా?
on Jul 21, 2025
టాలీవుడ్ టాప్ స్టార్స్ లో పవన్ కళ్యాణ్ ఒకరు. చిరంజీవి తమ్ముడిగా సినీ ఎంట్రీ ఇచ్చి ఆయన.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకొని, తిరుగులేని స్టార్ గా ఎదిగారు. అలాంటి పవన్ కళ్యాణ్ కూడా కెరీర్ స్టార్టింగ్ లో అవమానాలు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే రివీల్ చేశారు.
పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీ 'హరి హర వీరమల్లు' జూలై 24న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి హాజరైన పవన్ కళ్యాణ్.. సినిమా ప్రమోషన్స్ కోసం తాను మీడియా ముందుకు పెద్దగా ఎందుకు రానో చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
"నేను వచ్చిన కొత్తలో జ్యోతిచిత్ర, సితార పేపర్స్ ఉండేవి. వాటిలో నా ఫొటోలు వేయమని ఎవరో చెప్తే.. ఇతను సేలబుల్ కాదు అని వేసేవాళ్ళు కాదు. వాళ్ళు వేయనప్పుడు నేను మాత్రం వెంటపడటం ఎందుకని సైలెంట్ గా ఉండేవాడిని. అలా పబ్లిసిటీ లేకుండా సినిమాలు రిలీజ్ అవ్వడం అలవాటైంది. అందుకే సినిమాల పరంగా నేను పెద్దగా మీడియా ముందుకు రాను." అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
అలాగే సినీ పరిశ్రమ గురించి మాట్లాడుతూ.. "కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా.. ప్రతిభ ఉంటే ఎవరైనా సినీ రంగంలో రాణించవచ్చు. చిరంజీవి గారి తమ్ముడు కావచ్చు, చిరంజీవి గారి కొడుకు కావచ్చు.. నువ్వు ఎవరనేది విషయం కాదు. నీకు టాలెంట్ లేకుండా ఇక్కడ నిలబడలేవు. అది నాకొడుకైనా సరే." అని పవన్ కళ్యాణ్ అన్నారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కష్టాలు, అవమానాలు కామన్ అని.. టాలెంట్ లేకపోతే ఇక్కడ నిలబడలేమని తన అనుభవంతో చెప్పినట్లు అర్థమవుతోంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
