సినిమా మనల్ని కలిపిందని మర్చిపోవద్దు.. సీఎం తో మాట్లాడతాను
on Sep 30, 2025

విజయదశమి(Vijaya Dasami)కానుకగా అక్టోబర్ 2 న పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడానికి 'కాంతార చాప్టర్ 1'(Kantara Chapter 1)సిద్ధమవుతుంది. హిట్ మూవీ 'కాంతార' కి ప్రీక్వెల్ కావడంతో పాటు కథనాలు కూడా కాంతార కంటే ముందువి కావడంతో, చాప్టర్ 1 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ కూడా ఒక రేంజ్ లోఉంది. దీంతో చాప్టర్ 1 రాక కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచుస్తున్నారు. దాదాపుగా 125 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.
కాంతార కన్నడ చిత్రమనే విషయం తెలిసిందే. రీసెంట్ గా కాంతారా మేకర్స్ ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)ప్రభుత్వాన్ని టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి కోరడం జరిగింది. కానీ ఆర్ఆర్ఆర్ దగ్గర్నుంచి, మొన్నటి ఓజి వరకు, ఎన్నో భారీ తెలుగు చిత్రాని కన్నడ నాట కొంత మంది అడ్డుకున్నారు. తెలుగు సినిమా అనే ఉద్దేశంతో పోస్టర్లు, బ్యానర్లు కూడా చించేస్తున్నారు. సినిమాకి టికెట్ ధరల పెంపు విషయంలో హైకోర్టుకి కూడా వెళ్లడం జరిగింది. ఈ విషయంలో కన్నడ సినీ పరిశ్రమ నుంచి స్పందన కూడా రాలేదు. ఇప్పుడు కొంత మంది ఏపి ప్రభుత్వం దృష్టికి ఈ అంశాలన్నిటిని తీసుకొచ్చి, కాంతార టికెర్ రేట్స్ పెంపుకి పర్మిషన్ ఇవ్వద్దని సూచిస్తున్నారు.
కానీ ఈ విషయంపై అగ్ర నటుడు, ఏపి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan)స్పందిస్తు 'కర్నాటకలో పరిణామాలను దృష్టిలో ఉంచుకొని అక్కడి చిత్రాలకు ఇక్కడ ప్రోత్సాహం ఇవ్వడం ఆపవద్దు. కళ అనేది మనుషుల్ని కలపాలి గాని విడదీయకూడదనే వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుందాం. మంచి మనసుతో, జాతీయ భావనలతో ఆలోచనలు చేయాలి. కన్నడ కంఠీరవ డా.రాజ్ కుమార్(Rajkumar)గారి కాలం నుంచి ఇప్పటి కిచ్చా సుదీప్, ఉపేంద్ర, శివరాజ్ కుమార్, రిషబ్ శెట్టి వరకూ అందరినీ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సోదరభావంతో ఉన్నాము. మన సినిమాకి వ్యాపారపరంగా ఎదురవుతున్న ఇబ్బందుల్ని రెండు భాషల ఫిల్మ్ ఛాంబర్స్ కూర్చొని మాట్లాడుకోవాలి. అప్పుడు ప్రభుత్వపరంగా మాట్లాడదాం. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)గారి దృష్టికి తీసుకువెళతాను. కర్ణాటకలో ఎదురైన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కాంతారా ఛాప్టర్ 1 కి ఆటంకాలు కల్పించవద్దు అని అన్నారు.
.webp)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



