పవన్ ఫ్యాన్స్, ఆర్జీవీ ట్విట్టర్ యుద్దం.. నిజ రూపం ఇదే.. ఆర్జీవీ
on Oct 8, 2015
.jpg)
నిరంతరం విమర్శలకు కొలువైన రాంగోపాల్ వర్మ తాజాగా పవన్ కళ్యాణ్.. మహేశ్ బాబు ట్విట్టర్ అకౌంట్ పై ఫాలోవర్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి వర్మకి మధ్య ట్విట్టర్ యుద్దంగా మారింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉద్దేశించి వర్మ చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ ప్యాన్స్ కు మండిపోయి వాటికి ధీటుగా రాంగోపాల్ వర్మ మీద కూడా కౌంటర్ ఇచ్చారు. రాంగోపాల్ వర్మ హఠాత్తుగా మరణించాడని.. ఇండస్ట్రీకి పట్టిన పీడ తొలగిపోయిందంటూ ఓ ఇమేజ్ డిజైన్ చేసి దానిని సోషల్ మీడియాలో వదిలారు. ఇంకేముంది ఆవార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ చివరికి వర్మ వరకు చేరింది. అసలే విమర్సలు చేసే వర్మకు ఈ వార్త విని ఊరుకుంటాడా. తాను కూడా మళ్లీ పవన్ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టేలా ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
తాను కావాలనే పవన్ ట్విట్టర్ అకౌంట్ కి.. మహేశ్, సమంత అకౌంట్ కి పోలిక పెట్టానని.. ఈరకంగా అయినా పవన్ కు ఫాలోవర్స్ పెరుతారని అలా చేశానని వ్యాఖ్యానించారు. కానీ పీకే ఫ్యాన్స్ నిజ రూపం ఇదేనని.. పవన్ ఫ్యాన్స్ లో చాలా మంది అనాగరికులు... చదువు రాని వాళ్లు ఉండటం వల్ల తన భావాల్నిఅర్ధం చేసుకోలేక పోయారని ట్విట్ చేసేశాడు. అక్కడితో ఆగకుండా పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ కి ఇంగ్లీష్ నేర్పించాలని కూడా సూచించారు. అసలే వర్మ మీద ఫల్ ఫైర్ తో ఉన్న పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు ఈ ట్వీట్లకి ఎలా రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



