మల్లిక్ చేతుల మీదుగా పరవశమై ఆడియో విడుదల
on Jun 21, 2011
మల్లిక్ చేతుల మీదుగా "పరవశమై" ఆడియో విడుదల చేయబడింది. వివరాల్లోకి వెళితే నందలాల్ క్రియేషన్స్ పతాకంపై, శ్రీకాంత్ కృష్ణ, రీనా జంటగా, వాస్తవ్ తొలిసారిగా దర్శకత్వం వహిస్తూ, నిర్మించిన విభిన్నకథా చిత్రం "పరవశమై". ఈ సినిమాకి "నీ ప్రేమలో" అన్న క్యాప్షన్ గా నిర్ణయించారు. ఈ సినిమా నిర్మాణంలో విశేషం ఏమిటంటే నిర్మాత, దర్శకుడు, నటీనటులు, సంగీత దర్శకుడు ఇలా అందరూ కొత్తవారే పాలుపంచుకున్నారు. "పరవశమై" సినిమా ఆడియో విడుదల జూన్ 20 వ తేదీన నిజాంపట్నంలో కల రిషి మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో, ప్రముఖ కార్టూనిస్ట్, హాస్యరచయిత అయిన మల్లిక్, అద్దంకి మాజీ యమ్.యల్.ఎ. గరటయ్య గారి చేతుల మీదుగా విడుదల చేయబడింది. "పరవశమై" సినిమాకి యన్.వి.యస్.మణ్యం సంగీతాన్ని అందించారు. "పరవశమై" సినిమాకి పాటలను ప్రకాష్ పనసకర్ల వ్రాయగా, కథ, మాటలను శ్రీకాంత్ వ్రాశారు. "పరవశమై" సినిమాకి టెక్నికల్ హెడ్ గా ఉండి సినిమాటోగ్రఫీని నిర్వహించినది నందలాల్. ఈ "పరవశమై" నీ ప్రేమలో సినిమా ఆడియో విడుదల చాలా విభిన్నంగా జరిగింది.

ముందుగా ఈ చిత్రంలోని ఒక్కో పాటను ఒక్కో ప్రముఖుడితో ఆవిష్కరింప జేయగా, ఆ పాటను ఆడియోలో పాడిన గాయనీ గాయకులు వేదికపై పాడటం ఆహూతులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మల్లిక్ ప్రసంగిస్తూ "అంతా మాది యూత్ ఫుల్ ఫిల్మ్ అంటూంటారు. కానీ వాళ్ళల్లో ఒక్కొక్కళ్ళకీ వయసు 50 యేళ్ళ పైమాటే ఉంటుంది. కానీ నిజానికి ఇదీ యూత్ ఫుల్ ఫిల్మ్ అంటే. అందరూ యువకులే ఈ సినిమాకి పనిచేశారు.ఈ సినిమా నిర్మాణంలో పాల్గొన్న అందరూ కొత్తవారే కావటం విశేషం. ఈ రోజున గొప్ప గొప్ప వాళ్లంతా ఒకప్పుడు కొత్తవారే కదా...ఈ సినిమా ఘనవిజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.ఆల్ ది బెస్ట్" అని అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



