Home

»

Latest News

పంచనామా సిరీస్: హిట్ కొట్టిన ఉదయభాను.. 25 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో సంచలనం.!

Sep 18, 2026 6:20PM

జీ5 గత వారం ‘పంచనామా’ అనే ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రముఖ నటుడు భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.

మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కి నిర్మాత, షో రన్నర్‌గా ఉదయభాను వ్యవహరించారు. ఆరు ఎపిసోడ్స్‌‌తో వచ్చిన ఈ మొదటి సీజన్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. ఆరు ఎపిసోడ్స్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో ఆడియెన్స్‌ ఈ సిరీస్‌ను ఎక్కువగా వీక్షిస్తున్నారు.

వరుసగా మూడు హత్యలు జరగడం, పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఒక్క క్లూ కూడా దొరక్కపోవడం, చివరకు ఈ హత్యల వెనుకున్న కారణాన్ని తెలుసుకోవడం.. వంటి ఆసక్తికరమైన అంశాలతో ‘పంచనామా’ సిరీస్ ఎంతో ఉత్కంఠభరితంగా మారింది.

ఈ మొదటి సీజన్ క్లైమాక్స్ కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఎండింగ్ చూస్తే ఇది అంతం కాదు.. ఆరంభం అన్నట్టుగా ఉంటుంది. ఇక వెంటనే రెండో సీజన్ చూసేయాలన్నంత ఇంట్రెస్ట్ కలిగించేలా ఈ మొదటి సీజన్‌ను తెరకెక్కించారు.

ఇది కూడా చదవండి: డ్రాగన్‌లో లవ్ సాంగ్.. ఎన్టీఆర్ కోసం రూట్ మార్చిన నీల్.!

పోలీస్ ఇన్వెస్టిగేషన్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్‌లను ఇష్టపడే ప్రేక్షకులకు ‘పంచనామా’ కచ్చితంగా నచ్చుతుంది. అందుకే జీ5లో కేవలం వారం రోజుల్లోనే 25 మిలియన్ల డిజిటల్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను క్రాస్ చేసింది.

పోలీస్ ఆఫీసర్‌గా భరత్ యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. కొత్త యాంగిల్‌లో భరత్ తన పాత్రను పోషించారు. మోహన్ శ్రీవత్స మేకింగ్, నరేష్ కుమరన్ ఆర్ఆర్, సందీప్ కాంత్ కెమెరావర్క్ ఇవన్నీ కూడా సిరీస్‌ను నిలబెట్టాయి. ఈ సిరీస్‌లో మేధా రెడ్డి, శివాజీ రాజా, చరణ్ బాబు, రూపా లక్ష్మీ, రాధిక ప్రీతి, సూర్య, శ్రీజ పోషించిన పాత్రలు అందరినీ ఆకట్టుకుంటాయి.

మీకు నచ్చవచ్చు: తెలుసా నేస్తమా.. 'సింహరాశి'లోని ఈ క్లాసిక్ సాంగ్ మీనింగ్ తెలుసా.?

 

 

 

[Panchanama 25 Million Streaming Minutes, Panchanama Web Series, Panchanama Series Telugu, Telugu Web Series, Udaya Bhanu, Bharath Srinivasan, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com