Home

»

Latest News

శ్రీకాంత్ ఓదెల ద్వితీయ గండం దాటుతాడా!

Sep 18, 2026 5:47PM

 


ఎప్పుడు పుట్టిందో తెలియదు గాని దర్శకులకి తమ 'ద్వితీయ' మూవీ కలిసి రాదనే నానుడి ఎన్నో ఉదాహారణలతో చాలా బలంగానే వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ నానుడిని  శ్రీకాంత్ ఓదెల విషయంలో సినీ అభిమానులు,సినీ సర్కిల్స్  చర్చించుకుంటున్నాయి.

  
సాధారణంగా ఏ దర్శకుడికైనా మొదటి సినిమా విజయవంతం అయిన తర్వాత రెండో సినిమాపై సహజంగానే విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. 'దసరా' చిత్రంలో తెలంగాణ బొగ్గు గనుల నేపథ్యాన్ని, అక్కడి స్నేహం, ప్రేమ, రాజకీయ కోణాలను ఎంతో రస్టిక్ గా, సహజసిద్ధంగా వెండితెరపై ఆవిష్కరించి బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్నాడు శ్రీకాంత్ ఓదెల. 69వ శోభా ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ వేడుకలో ఉత్తమ నటుడు, ఉత్తమ తొలి చిత్ర దర్శకుడితో పాటు ఏకంగా 11 నామినేషన్లతో పలు విభాగాల్లో సత్తా చాటిన 'దసరా' కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో 'ది ప్యారడైజ్' ప్రాజెక్ట్ ప్రకటన నుంచే హాట్ టాపిక్‌గా మారింది. అయితే, టాలీవుడ్ చరిత్రను పరిశీలిస్తే ఎంతోమంది సక్సెస్‌ఫుల్ దర్శకులు తమ రెండో సినిమా వద్ద సరైన కథా ఎంపిక లేక లేదా భారీ అంచనాల ఒత్తిడికి లోనై బాక్సాఫీస్ వద్ద తడబడిన దాఖలాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో శ్రీకాంత్ ఓదెల 'ది ప్యారడైజ్' తో ఆ సెంటిమెంట్‌ను తిరగరాస్తారా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇటీవల ఈ చిత్రం గురించి దర్శకుడు స్పందిస్తూ, ఇది కేవలం ఒక సాధారణ యాక్షన్ డ్రామా మాత్రమే కాదని, ఒక తల్లి, కొడుకు బంధంతో పాటు ఒక జాతికి సంబంధించిన అత్యంత రివోల్యూషనరీ అండ్ ఎమోషనల్ కథ అని స్పష్టం చేశారు. ప్రేక్షకుల నమ్మకాన్ని కాపాడుకోవడం మరియు వారి అంచనాలను అందుకోవడంలో ఉన్న భయమే ఈ సినిమా మేకింగ్‌లో ఎంతో జాగ్రత్తలు తీసుకునేలా చేస్తోందని, అందుకే ప్రతి సీన్‌ను ఎంతో నిష్టతో తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. 

 

 

Also Read: అను ఇమ్మాన్యుయేల్ సంచలన నిర్ణయం: ఇలా జరుగుతుందని ఫ్యాన్స్ ఊహించలేదు  

దసరా'  100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి శ్రీకాంత్ ఓదెలను స్టార్ డైరెక్టర్ల సరసన నిలబెట్టడమే కాకుండా, ఆయన ప్రతిభకు తగ్గ గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇప్పుడు రాబోతున్న 'ది ప్యారడైజ్' ఆ రికార్డులను తిరగరాస్తూ, టాలీవుడ్‌ను వేధిస్తున్న ద్వితీయ గండం సెంటిమెంట్‌ను చెరిపేసి శ్రీకాంత్ ఓదెలను పాన్ ఇండియా లీగ్‌లో మరో స్థాయికి తీసుకెళ్తుందో లేదో చూడాలి. ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే గుండెల్లో అగ్గి రాజేసుకుంటూ వచ్చే పట్టుదల, తపన, కృషి అనేవి సెంటిమెంట్ కి విరుగుడు మంత్రాలు.

 

 

 

[Srikanth Odela, Nani, The Paradise Movie, Srikanth Odela About The Paradise Movie, Tollywood Updates, TeluguCinema News, TeluguCinema, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com