Home

»

Latest News

భయపెడుతున్న 'హతః' టీజర్: అదిరిపోయే  కంటెంట్‌‌తో వస్తున్న కిరణ్ అబ్బవరం.!

Sep 18, 2026 7:08PM

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రెజెంట్ చేస్తున్న లేటెస్ట్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ 'హతః'. తాజాగా ఈ సినిమా అఫీషియల్ టీజర్ విడుదలయ్యి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కేవలం ఒక్క నిమిషం పదిహేడు సెకన్ల వ్యవధి ఉన్న ఈ టీజర్ చూస్తుంటేనే హార్రర్, మిస్టరీ, అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ వైబ్స్ కనిపిస్తున్నాయి.

టీజర్ ప్రారంభంలోనే "ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి.. ఏంటిదంతా?" అంటూ ఒక వాయిస్ ఓవర్‌తో వాతావరణం అంతా చాలా సీరియస్‌గా మారిపోతుంది. దానికి తోడు సీనియర్ యాక్టర్ రెహమాన్ గంభీరమైన గొంతుతో "దేవుడు ఉన్నాడంటే నమ్ముతావా?" అని అడిగే ప్రశ్నకు, "నేను నీకు పూర్తి నిజం చెప్పినా.. నన్ను ఒక పిచ్చివాడిలా చూస్తావ్" అంటూ వినిపించే సంభాషణలు సినిమాలోని అసలైన మిస్టరీకి అద్దం పడుతున్నాయి. చీకటి వాతావరణం, మంచు కురుస్తున్న అడవులు, నీటిలో తేలుతున్న మనుషులు, రక్తంతో మెరిసే రహస్య సంకేతాలు, అకస్మాత్తుగా దాడి చేసే వింత జీవి.. ప్రతీ ఫ్రేమ్ కూడా ప్రేక్షకుడిని కుర్చీ అంచున కూర్చోబెట్టేలా డిజైన్ చేశారు.

ఈ సినిమాలో రెహమాన్, కుష్లు, తనూజ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనూష్ గోరక్ ఈ చిత్రానికి రచయితగా, సినిమాటోగ్రాఫర్‌గా, దర్శకుడిగా బాధ్యతలు నిర్వర్తించడం విశేషం. ఇక జెసిన్ జార్జ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌లోని ప్రతీ సన్నివేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. 

ఇది కూడా చదవండి: నాని బాక్సాఫీస్ తాండవం.. ఓవర్సీస్‌లో ‘ప్యారడైజ్’ ర్యాంపేజ్.!

KA ప్రొడక్షన్స్, పౌర్ణమి బ్యానర్లపై శివ శంకర్ నాయుడు వై, కిరణ్ అబ్బవరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 6న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఒక సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుందనడంలో సందేహం లేదు.

మీకు నచ్చవచ్చు: ట్రిపుల్ రోల్ కింగ్.. టాలీవుడ్‌లో తోపు యాక్టర్ ఎవరు?

 

 

 

[HATAH Teaser Review, Hatah Movie Telugu, HATAH Teaser, Kiran Abbavaram, Anush Gorak, Rahman, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com