ఓయ్... మెగా సిరీస్‌కి దర్శకుడు అతడే
on Jul 9, 2020

మెగా డాటర్, కాస్ట్యూమ్ డిజైనర్ సుష్మితా కొణిదెల వెబ్ సిరీస్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీనికి ఆనంద్ రంగా దర్శకత్వం వహిస్తున్నారని తెలిసింది. ఆల్మోస్ట్ పదకొండేళ్ల తరవాత అతడు మెగాఫోన్ పట్టిన ప్రాజెక్ట్ ఇది. 'ఓయ్' తరవాత అతడు డైరెక్షన్ చేయలేదు. కానీ, మెగా హీరోలు నటించిన పలు సినిమాలకు బ్యాక్ ఎండ్ వర్క్ చేశాడు. రామ్ చరణ్ 'ఆరెంజ్', అల్లు శిరీష్ 'శ్రీరస్తూ శుభమస్తు' తదితర సినిమాల్లో ఆనంద్ రంగాకి స్పెషల్ థాంక్స్ వేశారు. అతడిపై మెగాస్టార్ కుమార్తె, అల్లుడు నమ్మకం ఉంచారు.
యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్‌కి 'ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ ఫైర్' టైటిల్ పరిశీలనలో ఉందట. ఆల్రెడీ పూజా కార్యక్రమాలు నిర్వహించిన రోజున షూటింగ్ కూడా స్టార్ట్ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. లాక్‌డౌన్ గైడ్‌లైన్స్, రూల్స్ ఫాలో అవుతూ... గవర్నమెంట్ చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ చేస్తున్నారట. త్వరగా కంప్లీట్ చేసి ఓటీటీలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. స్టోరీ బాగా వచ్చిందని, ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుందని మెగా కాంపౌండ్ టాక్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



