జనసేనకు 'ఆరెంజ్' రీరిలీజ్ కలెక్షన్స్.. ఎంతో తెలుసా?
on May 19, 2023

రామ్ చరణ్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన 'ఆరెంజ్' సినిమాని ఇటీవల రీరిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. 2010 లో విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ గా నిలవగా, ఆ తర్వాత కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాని, అందులోని పాటలను ఇష్టపడేవారు ఎందరో ఉన్నారు. అందుకే అభిమానుల కోరిక మేరకు ఈ చిత్రాన్ని మళ్ళీ విడుదల చేశారు. అలాగే ఈ చిత్ర ప్రదర్శన ద్వారా వచ్చే డబ్బుని జనసేన పార్టీకి విరాళంగా అందిస్తామని నిర్మాత నాగబాబు ముందుగానే ప్రకటించారు. చెప్పినట్టుగానే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చెక్ రూపంలో ఆ మొత్తాన్ని అందజేశారు.
దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత ఎస్.కె.ఎన్ తదితరులతో కలిసి వెళ్లి పవన్ కళ్యాణ్ ని కలిసిన నాగబాబు.. ఆరెంజ్ చిత్ర ప్రదర్శన ద్వారా వచ్చిన ఒక కోటి ఐదు లక్షల రూపాయలను చెక్ రూపంలో అందజేశారు. ప్రింట్ల ఖర్చు, థియేటర్ల రెంట్లు ఇతర ఖర్చులు తీసివేయగా ఈ మొత్తం వచ్చిందని సమాచారం. ఏది ఏమైనా రీరిలీజ్ లో ఇంత మొత్తం రావడం విశేషమనే చెప్పాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



