ఇంక మిమ్మల్ని ఎవరు నమ్మరేమో!
on Sep 25, 2025

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan),వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్(Praksh Raj). ఒకరు హీరోగా, ఇంకొకరు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా సిల్వర్ స్క్రీన్ పై తమ నటనతో, అభిమానులని, ప్రేక్షకులని మెస్మరైజ్ చేయడంలో తిరుగులేని నటులు. గతంలో ఈ ఇద్దరు కలిసి చేసిన బద్రి, వకీల్ సాబ్ చిత్రాలు ఘన విజయం సాధించాయి. అందుకు ఆ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సన్నివేశాలే ప్రధాన కారణం. ఇప్పుడు మరోసారి 'ఓజి'(OG)తో అదే ఎట్మాస్పియర్ ని క్రియేట్ చేసారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. మూవీ చూసిన ప్రేక్షకులు కూడా ఇదే అభిప్రాయాన్నివ్యక్తం చేస్తున్నారు.
ఓజి లో ఓజాస్ గంభీర గా పవన్ కళ్యాణ్, సత్య దాదాగా ప్రకాష్ రాజ్ కనిపించారు. ఈ మూవీ కథ మొత్తం కూడా ఈ రెండు క్యారక్టర్ ల చుట్టూనే తిరుగుతుంది. సత్య దాదా ఆశయం కోసమే ఓజాస్ గంబీర పని చేస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇద్దరు తండ్రి కొడుకులు. ఇద్దరు కొడుకులు ఉన్న సత్యదాదా ఒక సన్నివేశంలో ఓజాస్ నా మూడో కొడుకు అని కూడా చెప్తాడు.దీన్ని బట్టి మూవీలో ఆ ఇద్దరి బాండింగ్ ఏ మేర ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అసలు స్క్రీన్ పై ఆ ఇద్దరి పెర్ ఫార్మెన్స్ చూస్తుంటే, థియేటర్ నుంచి బయటకి వచ్చాక కూడా క్యారక్టర్ లు మనల్ని వెంటాడుతుంటాయి. అంతగా తమ నటనతో మెస్మరైజ్ చేసారు. ఇప్పుడు రియల్ లైఫ్ లో ఇద్దరు వేరు వేరు రాజకీయ బావజాలాలతో పని చేస్తున్నారు. ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికి కూడా వెనకాడటం లేదు. పవన్ అభిమానులైతే ఈ విషయంలో ప్రకాష్ రాజ్ మీద సోషల్ మీడియా వేదికగా మాటల తూటాలని వదులుతున్నారు.
కానీ ఇప్పుడు 'ఓజి'లో ఆ ఇద్దరు పోషించిన క్యారక్టర్ లని చూసిన తర్వాత, ప్రకాష్ రాజ్ ని పవన్ అభిమానులు విమర్శించడానికి ఒక నిమిషం ఆలోచిస్తారనే మాటలు సోషల్ మీడియా వేదికగా వినపడుతున్నాయి. ఇక ఫ్యూచర్ లో ఆ ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నా, ఆ ఇద్దరు ప్రత్యర్దులని వెంటనే ఎవరు నమ్మరనే మాటలు కూడా వినపడుతున్నాయి. దీన్ని బట్టి ఆ ఇద్దరు ఓజి లో తండ్రి కొడుకులుగా ఎంతలా మెస్మరైజ్ చేసారో అర్ధం చేసుకోవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



