ఇలా అయితే పవర్ స్టార్ సినిమాలు వచ్చినట్టే.. మనం చూసినట్టే!
on Sep 13, 2023

ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇటీవల 'బ్రో' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన పవన్ చేతిలో ప్రస్తుతం 'ఓజీ', 'హరి హర వీరమల్లు', 'ఉస్తాద్ భగత్ సింగ్' వంటి సినిమాలున్నాయి. అయితే వీటిలో 'ఓజీ', 'హరి హర వీరమల్లు' సినిమాలు రెండు భాగాలుగా రానున్నాయని తెలుస్తోంది.
టాలీవుడ్ లో కొంతకాలంగా రెండు పార్ట్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పుడు ఆ ట్రెండ్ ని పవన్ కూడా ఫాలో కాబోతున్నారట. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'ఓజీ', 'హరి హర వీరమల్లు' సినిమాలు రెండు భాగాలుగా రావడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
అయితే ఇప్పటికే రాజకీయాల కారణంగా ఉన్న సినిమాలే ఆలస్యమవుతుంటే.. రెండు రెండు భాగాలంటే అవి ఎప్పటికి పూర్తవ్వాలి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఎప్పుడో మొదలైన 'హరి హర వీరమల్లు' పలు కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. అసలు ఇది ఎప్పుడొస్తుందో కూడా క్లారిటీ లేదు. ఇక ఇప్పుడు రెండు భాగాలంటే అభిమానులే షాక్ అయ్యే పరిస్థితి ఉంది. 'హరి హర వీరమల్లు'తో పోల్చితే 'ఓజీ' చిత్రీకరణ వేగంగానే జరుగుతోంది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలయ్యే టైంకి ఇది పూర్తవుతుందా లేదా అనే డౌట్ ఉంది. ఇక పార్ట్-2 కూడా ఉంటే, అది ఇప్పట్లో మొదలవ్వడం అనుమానమే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



