
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డ్రాగన్’ (Dragon) సరికొత్త రికార్డుల వేటను మొదలుపెట్టింది. మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఫస్ట్ గ్లింప్స్ తో అభిమానులకు బ్లాస్టింగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ అధికారికంగా క్లారిటీ ఇచ్చేసింది. ఇక తాజాగా టైమ్ ను కూడా రివీల్ చేసింది. మొదట అర్ధరాత్రి 12 గంటలకు అనుకున్న ఈ ఊచకోత అప్‌డేట్‌ను.. మరో 8 నిమిషాల ముందే, అంటే మే 19 రాత్రి సరిగ్గా 11 గంటల 52 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. (NTRNeel Glimpse)
ఈ ప్రకటనతో నందమూరి అభిమానుల్లో జోష్ నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. అయితే చిత్ర యూనిట్ కేవలం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ అయిన యూట్యూబ్‌లోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని ప్రధాన థియేటర్లలో కూడా ఈ ఫస్ట్ గ్లింప్స్‌ను భారీ ఎత్తున స్క్రీనింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. దీంతో మే 19 అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలంతో పండగ వాతావరణం నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది.
రుక్మిణి వసంత్ కథానాయికగా, బాలీవుడ్ ఐకాన్ అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ జాయింట్‌గా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి రవి బస్రూర్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్ల రూఫ్‌లను బద్దలు కొట్టేలా ఉండబోతోందని ఇన్ సైడ్ టాక్.
జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి రేపు రాత్రి 11:52 గంటలకు విడుదల కాబోయే 4 నిమిషాల పైగా నిడివి గల గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో ఎలాంటి సరికొత్త రికార్డులను సృష్టిస్తుందో, యూట్యూబ్ వ్యూస్ పరంగా ఎలాంటి ప్రకంపనలు పుట్టిస్తుందో చూడాలి.




