ఎన్టీఆర్ ఫైనల్ కాల్ కోసం కొరటాల శివ వెయిటింగ్!
on Feb 13, 2023

ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని గత ఏడాది అంటే 2022 మే 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ చిత్రం ఇప్పటివరకు సెట్స్ పైకి వెళ్ళలేదు. కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరుపుకోలేదు.
కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య డిజాస్టర్ కావడంతో ఈ చిత్రంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కానీ ఎన్టీఆర్ మాత్రం మాటకే నిలబడ్డారు. ఏది ఏమైనా తన తదుపరిచిత్రం అంటే ఎన్టీఆర్ 30 చిత్రాన్ని కొరటాల శివ తోనే చేయడానికి సిద్ధమయ్యారు. అయితే స్క్రిప్ట్ విషయంలో మాత్రం కఠినంగా ఉన్నారు. దాంతో ఇంతకాలం కొరటాల శివ తను అనుకున్న స్క్రిప్ట్ కు మార్పులు చేర్పులు చేస్తూ వచ్చారు. దాంతో ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా బైండెడ్ స్క్రిప్ట్ తో కొరటాల సిద్ధంగా ఉన్నారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ కాస్త బిజీగా మారారు. వాస్తవానికి ఈ సినిమా ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ మిక్కిలినేని నిర్మించబోతున్నారు.
ఎన్టీఆర్ సరసన మొట్టమొదటిసారిగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు ఝాన్వి కపూర్ నటిస్తోంది. దాంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ఇప్పటివరకు పూజా కార్యక్రమాలు కూడా జరుపుకోకుండా ఆలస్యం అవుతుంది. స్క్రిప్టు అయితే కొరటాల లాక్ చేశారు. ఎన్టీఆర్ ఫైనల్ కాల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నెలలోనే ప్రారంభం కావాల్సిన చిత్రం మార్చి మూడో వారానికి వాయిదా పడింది. ఎన్టీఆర్ ఓకే అంటే వచ్చే నెల నుంచి శంషాబాద్ లో తయారు వేసిన ప్రత్యేక సెట్టులో ఫస్ట్ షెడ్యూల్ని జరపాలని కొరటాల భావిస్తున్నారు.
తదుపరి షెడ్యూల్ ని గోవాలో చేయాలని అనుకుంటున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ జాలరిగా కనిపించనున్నాడట. కాగా ఈ చిత్రాన్ని 2024 ఏప్రిల్ 5న విడుదల చేస్తామని ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించారు. ఈ చిత్రానికి రత్న వేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సాబు సిరి ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



