ప్రభాస్ వర్సెస్ తారక్: ప్రాజెక్ట్ సైఫ్
on Jun 7, 2023
రెండు మూడు రోజులుగా ఇంటర్నెట్ మొత్తం రామ మంత్రంతో హోరెత్తింది. జై శ్రీరామ్ అని వినిపించిన ప్రతిచోటా రావణాసురుడి ప్రస్తావన ఉండే తీరుతుంది కదా. అలా ప్రభాస్ సినిమా ఆదిపురుష్ గురించి మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ విలన్ సైఫ్ గురించి కూడా ప్రస్తావిస్తున్నారు జనాలు. నార్త్ మీడియా అయితే ప్రభాస్‌రాముడికి సైఫ్ లంకేష్ పర్ఫెక్ట్ గా దొరికాడు. స్క్రీన్ మీద పాజిటివ్ వైబ్స్ ఇట్టే కనిపిస్తున్నాయి అని అంటున్నారు. తిరుపతిలో ఆదిపురుష్ వేడుకకు రెండున్నరకోట్లు ఖర్చుపెట్టారని, బాణాసంచాకే 50లక్షలు పెట్టారని రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో మన దగ్గర మాత్రం ఇంట్రస్టింగ్ టాపిక్ ఒకటి వైరల్ అవుతోంది. సైఫ్‌ని తెలుగుకు పరిచయం చేసిన క్రెడిట్ ప్రభాస్ కి చెందుతుందా? తారక్‌కి చెందుతుందా? అన్నదే ఆ టాపిక్. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్‌కి డైరక్టర్ ఔం రవుత్. నార్త్ డైరక్టర్. నిర్మాణ సంస్థ కూడా మెజారిటీగా నార్త్ దే. తారక్ నటిస్తున్న సినిమాకు నిర్మాతలు తెలుగువారు.
దర్శకుడు తెలుగువారు. ప్రభాస్ తెలుగువాడైనా, ఎక్కువ ఓట్లు నార్త్ కే పడుతున్నాయి కాబట్టి, అది నార్త్ మూవీ కిందే లెక్క. సో తారక్ దేవర మూవీనే సైఫ్‌కి ఫస్ట్ తెలుగు సినిమా అంటూ ఒక వెర్షన్‌ని స్ప్రెడ్ చేస్తున్నారు తారక్ ఫ్యాన్స్. అదెలా కుదురుతుంది? ప్రభాస్ స్క్రీన్ మీద యాక్ట్ చేస్తే అది తెలుగు సినిమానే అవుతుంది. కాబట్టి ఆదిపురుష్ తెలుగు మూవీనే, ఆ సినిమాతోనే సైఫ్‌కి తెలుగుకు ఇంట్రడ్యూస్ అయినట్టు అంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. బాలీవుడ్ హీరో కేంద్రంగా జరుగుతున్న ఈ చర్చను ఆసక్తిగా గమనిస్తోంది నార్త్ మీడియా. వచ్చే రెండు వారాలూ దేవర సెట్లో ఉంటారు సైఫ్. దేవర చిత్రాన్ని ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఎలా రీచ్ అయ్యేలా చేయాలోననే విషయమై తానూ, తారక్ చాలా సార్లు మాట్లాడుకున్నామన్నది సైఫ్ ఇచ్చిన స్టేట్‌మెంట్.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
