Home

»

Latest News

త్రివిక్రమ్, చినబాబు మధ్య విభేదాలు: 'గాడ్ ఆఫ్ వార్' ఆగిపోయిందన్న వార్తలకు ఒకే ఒక్క ఫొటోతో చెక్.!

Nov 13, 2026 1:47PM

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన 'గాడ్ ఆఫ్ వార్' సినిమాపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే గత రెండు రోజులుగా ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత చినబాబు మధ్య విభేదాలు వచ్చాయని.. దీంతో ఆయన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ నుంచి త్రివిక్రమ్ బయటకు వచ్చేస్తున్నారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణంలో.. ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ చేయాల్సిన 'గాడ్ ఆఫ్ వార్' సినిమా కూడా ఆగిపోయే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. దీంతో తారక్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. 

కట్ చేస్తే.. ఈ రూమర్స్‌కు సమాధానం చెప్పేలా మూవీ టీమ్ తాజాగా ఓ ఫొటోను విడుదల చేసింది. ఇందులో నిర్మాత చినబాబు, ఎన్టీఆర్, త్రివిక్రమ్, కళ్యాణ్ రామ్ నలుగురూ కలిసి నవ్వుతూ కనిపించారు. దీంతో వీరి మధ్య విభేదాలు వచ్చాయన్న ప్రచారానికి ఈ ఒక్క ఫొటోతోనే గట్టి కౌంటర్ ఇచ్చినట్లయింది.

ఇక 'గాడ్ ఆఫ్ వార్' విషయానికి వస్తే.. ఇది సుబ్రహ్మణ్యస్వామి నేపథ్యంలో తెరకెక్కనున్న భారీ మైథలాజికల్ మూవీ. ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధమైందని త్రివిక్రమ్ స్వయంగా గతంలో వెల్లడించారు. అంతేకాదు 'గాడ్ ఆఫ్ వార్'ను భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. 'వారణాసి' తర్వాత అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందనున్న సినిమాగా ఇది నిలవనుంది అంటున్నారు.

ఇది కూడా చదవండి: ‘గాడ్ ఆఫ్ వార్’కి బ్రేక్.. చిరంజీవితో త్రివిక్రమ్ సినిమా.?

గతంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి కలవబోతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ తొలిసారి పౌరాణిక నేపథ్యాన్ని ఎంచుకోవడం, ఎన్టీఆర్ కార్తికేయుడి పాత్రలో కనిపించనుండటం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

మొత్తానికి చినబాబు, త్రివిక్రమ్ మధ్య విభేదాలంటూ వచ్చిన వార్తలకు ఈ ఫొటోతో తెరపడింది. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న 'డ్రాగన్' పూర్తయిన తర్వాత ఈ భారీ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది.

మీకు నచ్చవచ్చు:
నిర్మాతగా మారుతున్న బాలయ్య కుమార్తె.. హీరో, డైరెక్టర్ ఎవరో తెలుసా.?
బాక్సాఫీస్ ప్రభంజనం.. 8 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్‌లోకి ‘రామాయణ’.!

 

 

 

[God Of War, Jr NTR, Trivikram Srinivas, Chinnababu, Kalyan Ram]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com